సింగిల్ పర్మిట్ అమలులో ఏపీ సర్కారు జాప్యం
నేడు చంద్రబాబును కలవనున్న టీ.లారీ యజమానుల సంఘం
సాక్షి, హైదరాబాద్: అంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య సరిహద్దు దాటే లారీలకు సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయ టంలో తీవ్ర జాప్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ లారీ యజమా నుల సంఘం అమీతుమీ తేల్చుకునేం దుకు సిద్ధమైంది. తాత్కాలిక పర్మిట్ రూపంలో ఒక్కో లారీకి ఏడాదికి వేలాది రూపా యల నష్టం వాటిల్లుతోందని లారీ యజ మానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం తెలం గాణ లారీ యజమానుల సంఘం గౌరవా ధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆధ్వ ర్యంలో విజయవాడ వెళ్లి ఏపీ సీఎం చంద్ర బాబును కలవాలని నిర్ణరుుంచారు. సిం గిల్ పర్మిట్ విధానం అమలు చేయాల్సి ఉంది. కానీ దానికి ఏపీ ప్రభుత్వం ముం దుకు రాకపోవటంతో తాత్కాలిక పర్మిట్ రూపంలో రోజూ రూ.1600, వారానికి రూ.4200 చెల్లించాల్సి వస్తోంది. సింగిల్ పర్మిట్ విధానంలో రూ.5 వేలు చెల్లిస్తే సంవత్సరమంతా ఎన్ని ట్రిప్పులైనా స్వేచ్ఛగా తిరిగే వీలు చిక్కుతుంది.