ఉరేసుకుని రిటైర్డ్ పోలీస్ మృతి
తొగర్రాయి(కోదాడరూరల్): ఉరేసుకుని రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని తొగర్రాయిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండపునేని వెంకటేశ్వరావు (59) సూర్యాపేటలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసి గత సంవత్సరం రిటైర్డ్ అయ్యారు. అక్కడే సొంతింటిని నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. దీంతోపాటు షుగర్ వ్యాధి ఉండటంతో కాలిబోటన వేలిని కూడ తొలగించారు. అయితే ఆదివారం సాయంత్రం సూర్యాపేట నుంచిlస్వగ్రామమైన తొగర్రాయికి బైక్‌పై బయలు దేరాడు. గ్రామంలోకి వెళ్లకుండానే గ్రామ శివారులో ఉన్న మర్రిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున అటుగా వెళ్లిన ఓ వ్యక్తి గమణించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వారు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగాSఅనారోగ్యం పాలు కావడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు బావిస్తున్నారు. అయితే అతను ఉరేసుకున్న తీరు చూసి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు కిరణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు.