Token system
-
జనరల్ బోగీల్లో సీటు గ్యారంటీ
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో సాధారణ బోగీల్లో ప్రయాణం కోసం పడిగాపులు కాస్తున్నారా.. బోగీల వద్ద కిక్కిరిసిన జనం మధ్యలోంచి రైల్లోకి ప్రవేశించలేకపోతున్నారా.. కష్టపడి రైలెక్కినా సీటు లభించక తీవ్ర నిరాశకు గురికావలసి వస్తోందా.. ఇలాంటి సమస్యలకు దక్షిణమధ్య రైల్వే ఒక టోకెన్‌తో పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణ బోగీల్లో ప్రయాణం చేసేవారు టోకెన్ తీసుకొంటే చాలు వారికి కేటాయించిన బోగీలో, సీటులో కూర్చొని నిశ్చింతగా ప్రయాణం చేయవచ్చు. రైలెక్కే సమయంలో టోకెన్ నంబర్ ప్రకా రం ప్రయాణికులను అనుమతిస్తారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే బయోమెట్రిక్ టోకెన్ వ్యవస్థను సికిం ద్రాబాద్ స్టేషన్లో మంగళవారం ప్రారంభించింది. దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఈశ్వరరావు, సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఎ.కె.గుప్తా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయి తే, సీట్లు నిండిన తర్వాత వచ్చే ప్రయాణికులకు టికెట్లు ఇవ్వాలా?.. వద్దా?.. అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రయాణం ఇలా... ►అన్‌రిజర్వుడ్ కోచ్‌లలో ప్రయాణించే వారు క్యూలైన్లలో నిల్చోవలసిన అవసరం లేకుండా, ప్రయాణికులలో గందరగోళం, తొక్కిసలాట వంటివి చోటుచేసుకోకుండా బయోమెట్రిక్ టోకెన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ►ఈ యంత్రంలో మొదట ప్రతి ప్రయాణికుడి పేరు, రైలు నంబరు, పీఎన్ఆర్ నంబరు, అతడు/ఆమె వెళ్లవలసిన స్టేషన్, తదితర వివరాలను నమోదు చేస్తారు. ►ప్రయాణికుల బయోమెట్రిక్ సమాచారంలో భాగంగా వారి వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్ తీసుకుంటారు. అనంతరం బయోమెట్రిక్ యంత్రం ఆటోమెటిక్‌గా ఒక సీరియల్ నంబరుతో టోకెన్‌ను అందజేస్తుంది. ►ఈ టోకెన్ నంబర్ ప్రకారం ప్రయాణికులు వారికి కేటాయించిన కోచ్‌లలోనే రైలు ఎక్కాలి. ►ప్రయాణికులు టోకెన్ తీసుకున్నాక కోచ్ వద్దకు ప్రయాణ సమయానికి 15 నిమిషాలు ముందుగానే చేరుకోవచ్చు. భద్రతకు భరోసా... ►ఈ టోకెన్ వ్యవస్థ ద్వారా ప్రయాణికుల భద్రతకు భరోసా లభించనుంది. జనరల్ బోగీల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడి ఫొటో, వేలిముద్రలు నమోదు కానున్న దృష్ట్యా నేరాల నియంత్రణకు అవకాశం లభించనుంది. ►అత్యంత రద్దీ ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బయోమెట్రిక్ టోకెన్ యంత్రం ఏర్పా టుచేయడం పట్ల సెక్యూరిటీ విభాగం, సికింద్రాబాద్ డివిజన్ అధికారులు, సిబ్బందిని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. జనరల్ కోచ్‌లలో ప్రయాణించే అన్రిజర్వ్డ్ ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని, ప్లాట్‌ఫారాల వద్ద రద్దీ నివారణకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. -
టోకెన్ ఉంటేనే మద్యం అమ్మబడును
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు మందు బాబులు బారులు తీరారు. అన్ని మద్యం షాపుల ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిచ్చాయి. కనీసం భౌతిక దూరం పాటించకుండా ఒకరి మీద తోసుకుంటూ లిక్కర్ కోసం ఎదురు చూసిన దృశ్యాలు అనేకం. దీంతో కొన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచిన వెంటనే మళ్లీ మూసివేశారు. అక్కడక్కడా పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నా జనం లెక్కచేయకుండా షాపుల ముందు బారులు తీరుతున్నారు. ఈ సమస్యను చెక్ పెట్టేందుకు కేజ్రివాల్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను రచించింది. ఈ-టెకెన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై మద్యం కొనాలంటే టోకెన్ విధానాన్ని అనుసరించాల్సిందే. టోకెన్ నెంబర్ ఆధారంగా ఆ టైంలోనే మద్యం షాపులకు వెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ముందుగా వివరాలు నమోదుచేసుకున్న వారు ఆ సమయానికి వెళ్లి నేరుగా మద్యాన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపింది. (మహమ్మారితో మనుగడ సాగించాల్సిందే.. ) Delhi Government has launched an e-token system (demo token in pic) for the sale of liquor in the national capital. This decision has been taken in view of crowding at liquor shops so that social distancing can be maintained. A web link has been issued for the same: Delhi Govt pic.twitter.com/rqgzQ5bfEg — ANI (@ANI) May 7, 2020 -
టోకెన్ కొట్టు.. మద్యం పట్టు: నిజామాబాద్
కాలం మారేకొద్ది మనుషులూ మారుతున్నారు. అంతేనా అంటే రాజకీయ పార్టీలూ మారుతున్నాయి! సభలు, సమావేశాలకు వచ్చేవారికి కాస్తయినా మర్యాద చేయాలి. అందుకు వచ్చినవారికి ఒక్కో టోకెన్ చొప్పున ఇస్తున్నారు. ఆ టోకెన్‌ను సంబంధిత వైన్స్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఈ కొత్త పద్ధతి ద్వారా రాజకీయ పార్టీలకు వైన్స్‌ల నిర్వాహకులు సహకరించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం అది నేరమంటున్నారు. సాక్షి, కామారెడ్డి క్రైం: రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికలంటేనే డబ్బు, మద్యంతో సావాసం. ఇదివరకు గ్రామంలోని ఓ పార్టీ పెద్దమనిషి చీటి రాసి ఇస్తే కల్లు దుకాణంలో కల్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. ఎన్నికల వేళ కల్లును ఆశించే వారే లేరు. ప్రచారానికి వచ్చే వారి నుంచి మద్యానికి డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మద్యం, నగదులాంటి ప్రలోభాలకు ఓటర్లను గురిచేయడం నేరం. ఇలాంటి నిబంధనలను తప్పించుకుంటూ తమ వారికి మద్యం, నగదు అందించేందుకు ఆయా పార్టీల పెద్దలు కొత్తదారులు వెతుకుతున్నారు. మద్యం దుకాణాల ద్వారా తమ కార్యకర్తలకు మందు సరఫరా చేసేందుకు కొత్తగా టోకెన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు జనాన్ని తరలించిన సందర్భాల్లో, ఇతర ప్రచార కార్యక్రమాల సమయాల్లో మద్యాన్ని నేరుగా ఇవ్వకుండా టోకెన్లు ఇస్తున్నారు. వారిచ్చిన టోకెన్ తీసుకుని వైన్స్‌కు వెళితే ఒక్కో లోకెన్కు ఒక మందు బాటిల్ చొప్పున ఇచ్చేస్తారు. గతంలోనూ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సమయాల్లో ఈ విధమైన పద్ధతులను అనుసరించినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో టోకెన్లకు గిరాకీ బాగా పెరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ వ్యాపారమే పరమావధిగా తీసుకుంటున్న వైన్స్‌ల నిర్వాహకులు పార్టీల పెద్దలకు తమ పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మచ్చికతో రాజకీయ మర్యాద.. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టోకెన్ పద్ధతిలో మద్యం పంపిణీ నడుస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పార్టీ సమావేశం అనంతరం కొందరు కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఓ పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకుడు తనకు పైనుంచి వచ్చిన 70 టోకెన్లు పంచేశానని, మిగిలినవారు అడిగితే ఎక్కడి నుంచి తేవాలనడం ఆశ్చర్యానికి గురిచేసింది. తమ వెంట వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ప్రచారం పూర్తయ్యాక మర్యాదలు చేసేందుకు నేరుగా కొంత డబ్బును, మద్యం టోకెన్లను ఇచ్చుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మద్యం నిల్వలు తమ దగ్గర పెట్టుకునే బాధలేకుండా రాజకీయ పార్టీల నేతలకు వైన్స్‌ల నిర్వాహకులు విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో టోకెన్ పద్ధతిలో మద్యం విక్రయించే వారిపై ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు విరుద్ధం.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం నేరం. అయినా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. టోకెన్ పద్ధతిలో మద్యం కొనుగోళ్లకు అనుమతి లేదు. రాజకీయ పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు ఇలాంటి పద్ధతులను అవలంబిస్తుండగా దుకాణాల యజమానులు వ్యాపారం ముసుగులో పార్టీలకు సహకారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బెల్టుషాపుల్లో సైతం టోకెన్ సిస్టం అమలవుతోంది. ఇప్పటికే జిల్లాలోని చాలాచోట్ల దాడులు చేసి అక్రమ మద్యం నిల్వలు, రవాణాను ఎక్సైజ్ అధికారులు పట్టుకుని కేసులు చేశారు. టోకెన్ విధానంలో మద్యం విక్రయాలు చేయకూడదని చెబుతున్నారు. తమ దృష్టికి వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
టోకెన్ ఉండాల్సిందే
నీలగిరి: ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతులకు టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న గ్రామ సంఘాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల్లోని రైతుల వివరాలు, సాగువిస్తీర్ణం, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే అక్టోబర్ మూడోవారంలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటిలోగా రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించే ఐకేపీ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అహర్నిశలు శ్రమించి ధాన్యం కొనుగోలు చేస్తున్న సంఘాలపై రాజకీయ, అధికార ఒత్తిళ్లు తీవ్రమైన నేపథ్యంలో జిల్లాయంత్రాగం ‘టోకెన్’ విధానానికి తెరతీసింది. ప్రధానంగా రబీసీజన్‌లో అకాలవర్షాలు, గాలిదుమారాల కారణంగా ఐకేపీ కేంద్రాలు తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది. కొనుగోలు సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాజకీయపార్టీలు రైతులపక్షాన ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. ఐకేపీ కేంద్రాల నెత్తిన భారం అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండండంతో మరో గత్యంతరం లేక ఐకేపీ సంఘాలు పలు సందర్భాల్లో తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదీగాక గ్రామాల్లో రైతుల నుంచి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా మళ్లీ రైతుల పేర్లతో ఐకేపీ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. పంటదిగుబడి అధికంగా వచ్చినప్పుడు కూడా కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తోంది. ఈవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం సంఘాల వద్ద లేదు. దీంతో భారీఎత్తున కొన్న ధాన్యాన్ని మిల్లర్లకు రవాణా చేయడం కూడా సమస్యగా మారింది. దీనిని అదనుగా భావిస్తున్న మిల్లర్లు సైతం ధాన్యంలో క్వింటాళ్ల కొద్ది కోత పెడుతున్నారు. ఈ నష్టాన్ని ఐకేపీ కేంద్రాలు భరించాల్సి వస్తోంది. వారికి చెల్లించే ధాన్యం కమీషన్లో ఆ నష్టాన్ని తగ్గించి చెల్లిస్తున్నారు. దీంతో గత రబీ సీజన్లో దాదాపు రూ. 2 కోట్ల నష్టం వాటిల్లింది. ఐకేపీ కేంద్రాలు తరలించిన ధాన్యానికి మిల్లర్లు ఇచ్చిన రశీదులకు మధ్య రూ.2కోట్లు విలువ చేసే ధాన్యం తేడా వచ్చింది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలకు విరుగుడుగా అధికారులు ఖరీఫ్ సీజన్ నుంచి టోకెన్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. టోకెన్ విధానంతో తీరనున్న కష్టాలు.. * ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో రైతులు తమ పేర్లను కేంద్రాల వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. * రిజిస్టర్ చేయించుకున్న రైతులకు ఏ రోజున కేంద్రానికి ధాన్యం తీసుకురావాలో తెలియజేస్తూ ఓ టోకెన్ ఇస్తారు. * రిజిస్టర్ చేయించుకున్న రైతులు బ్యాంకు ఖాతాలు తప్పని సరిగా కలిగిఉండాలి. * తద్వారా ధాన్యం పైకాన్ని రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు. * రిజిస్టర్ చే యించుకునే రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకాలు, లేదా భూములకు సంబంధించిన ఆధారాలు కేంద్రాలకు సమర్పించాలి. * టోకెన్ విధానం వల్ల ఐకేపీ కేంద్రాలకు ఒకేసారి ధాన్యం తీసుకురావడం తగ్గుతుంది. ప్రైవేటు వ్యాపారుల జిమ్మిక్కులను కూడా కట్టడి చేయొచ్చు. * ఈ విధానం వల్ల ఐకేపీ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ధాన్యం నిల్వ ఉండదు. ఎప్పటికప్పుడు వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే వీలుంటుంది.