toli kiranam
-
యేసుక్రీస్తు జీవిత కథతో...
ఇప్పటి వరకూ యేసుక్రీస్తు జీవితకథతో చాలా సినిమాలొచ్చాయి. తాజాగా పీడీ రాజు యేసుక్రీస్తుగా నటించిన చిత్రం ‘తొలి కిరణం’. జె. జాన్‌బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై బేబీ మేరీ విజయ సమర్పణలో రూపొందిన ఈ సినిమాని డిసెంబర్ 14న విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 7న జాన్‌బాబు జన్మదినం సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జాన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని చాలా కష్టపడి నిర్మించాం. ఇందులోని 45 నిమిషాల గ్రాఫిక్స్ హైలెట్‌గా ఉంటాయి. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. కష్టపడి నటించాం’’ అన్నారు íపీడీ రాజు. ‘‘ఈ సినిమా చాలా నేచురల్‌గా ఉంది. ఇలాంటి సినిమాలు మన తర్వాతి సమాజానికి చాలా అవసరం’’ అని నటుడు బెనర్జీ అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ సాగర్‌తో పాటు చిత్రబృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఆర్పీ పట్నాయక్. -
ఏదో శక్తి నడిపించింది!
‘‘నా దృష్టిలో దేవుడికి మతం లేదు. దేవుణ్ణి అనుసరించే వాళ్లకు మతం ఉంటుంది. నేను హిందువు అయినా క్రీస్తుపై తీస్తున్న ఈ చిత్రానికి పాటలు స్వరపరిచే క్రమంలో ఏదో శక్తి నన్ను వెనకుండి నడిపించింది’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత భూమ్మీద 40 రోజులు తిరిగిన ఏసుక్రీస్తు ఏం చేశారనే కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘తొలి కిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ స్వరకర్త. ఇటీవల ఆడియో విడుదలైంది. ఆయన మాట్లాడుతూ – ‘‘జాన్‌బాబు, సుధాకర్‌లు క్రీస్తు మీద చిత్రమనగానే ఎక్కువ కాలం నిలబడే పాటలు చేయాలనుకున్నా. బైబిల్ పదాలతో కాకుండా వాడుక భాషలోని పదాలతో పాటలు రాయించాను. మారుమూల ప్రాంతాల నుంచి ఓ వంద ఫోనులొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి చర్చి నుంచి ‘తొలి కిరణం’ ఆడియో సీడీలు కావాలని ఫోనులొస్తున్నాయి. ముఖ్యంగా ఎస్పీబీగారు పాడిన శిలువ పాట, నేనూ, సునీత పాడిన ‘శాంతికి దూతగా..’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. నా దర్శకత్వంలో ప్రియమణి ముఖ్యతారగా కన్నడ, తెలుగు సినిమా ‘వ్యూహం’ను ఏప్రిల్ 14న విడుదల చేస్తాం. ప్రస్తుతం రెండు కథలు సిద్ధం చేశాను. వాటిలో నేను నటించను. హీరోలకు వినిపిస్తున్నా. ఓకే అయిన తర్వాత చెబుతా’’ అన్నారు. -
క్రిస్మస్కి... తొలి కిరణం
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి కిరణం’. పీడీ రాజు, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో సాగుతోంది. ‘‘ప్రపంచానికి వెలుగు చూపిన ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా ఈ చిత్రం చేస్తున్నాం. ప్రేక్షకుల మనస్సుల్లో ఈ చిత్రం నిలిచిపోతుంది’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కథ-పాటలు: టి.ఎ ప్రభుకిరణ్ , రచనా సహ కారం: వి.ఎం.ఎం. ప్రవీణ్, సంగీతం: ఆర్.పి. పట్నా యక్, కెమెరా: మురళీకృష్ణ.