బెంగళూరు ఐఐఎం కోర్సులకు టాప్ ర్యాంకు
బెంగళూరు: బెంగళూరు ఐఐఎం నిర్వహిస్తున్న మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు మధ్య ఆసియాలో టాప్ ర్యాంకు దక్కింది. పారిస్ కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఎడ్ యూనివర్సల్ నిర్వహించిన అధ్యయనంలో బెంగళూరు ఐఐఎం నిర్వహిస్తున్న మూడు కోర్సులు బెస్ట్ కోర్సులుగా ఎంపికయ్యాయి.
మేనేజ్ మెంట్ లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, పబ్లిక్ పాలసీలో ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఏడాది ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోర్సులు టాప్ ర్యాంకులో నిలిచాయి.