కళ్లు కూడా కనిపించడానికి వీలులేదు!
సిరియాలో మహిళలపై జీహాదీల ఆంక్షలు
బీరుట్: సిరియాలో జీహాదీలు మహిళలపై కఠిన ఆంక్షలకు దిగారు. శరీరంలో ఏ అవయవం కనిపించడానికి వీలులేదని ఆంక్షలు విధించారు. శరీరంలో ఏ భాగం కనిపించని విధంగా వస్త్రధారణ ఉండాలని నిషేధాజ్ఞలు జారీ చేశారు.
చివరకు కళ్లు కూడా కనిపించడానికి వీలులేదని ఆదేశించారు. రంగు రంగుల వస్త్రాలు ధరించకూడదు.వస్త్రాలపై పూసలు వంటి అలంకరణ వస్తువులు ఉండకూడదు. హైహీల్స్ చెప్పులు వాడకూడదు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు శిక్షలు కూడా విధిస్తారు. ఈ ఆదేశాలను జీహాదీల నియంత్రణలోని దీర్ ఎజ్జార్ ప్రాంతంలో జారీ చేసినట్లు సిరియా మానవ హక్కుల పరిశీలన సంస్థ తెలిపింది.