కళ్లు కూడా కనిపించడానికి వీలులేదు! | Jihadists order total coverup for Syrian women | Sakshi
Sakshi News home page

కళ్లు కూడా కనిపించడానికి వీలులేదు!

Published Thu, Jul 31 2014 7:13 PM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM

కళ్లు కూడా కనిపించడానికి వీలులేదు! - Sakshi

కళ్లు కూడా కనిపించడానికి వీలులేదు!

సిరియాలో మహిళలపై జీహాదీల ఆంక్షలు
  బీరుట్: సిరియాలో జీహాదీలు మహిళలపై కఠిన ఆంక్షలకు దిగారు. శరీరంలో ఏ అవయవం కనిపించడానికి వీలులేదని ఆంక్షలు విధించారు. శరీరంలో ఏ భాగం కనిపించని విధంగా వస్త్రధారణ ఉండాలని నిషేధాజ్ఞలు జారీ చేశారు.

చివరకు కళ్లు కూడా కనిపించడానికి వీలులేదని  ఆదేశించారు. రంగు రంగుల వస్త్రాలు ధరించకూడదు.వస్త్రాలపై  పూసలు వంటి అలంకరణ వస్తువులు ఉండకూడదు. హైహీల్స్ చెప్పులు వాడకూడదు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు శిక్షలు కూడా విధిస్తారు. ఈ ఆదేశాలను జీహాదీల నియంత్రణలోని దీర్ ఎజ్జార్ ప్రాంతంలో జారీ చేసినట్లు సిరియా మానవ హక్కుల పరిశీలన సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement