
కుర్దు నాయకుడికి కూల్చేస్తున్న సేనలు (రాయిటర్స్ ఫొటో)
అఫ్రిన్, సిరియా : సిరియాలోని ఆఫ్రిన్ నగరంలో టర్కీ సేనలు పాగా వేశాయి. దేశానికి ఆఫ్రిన్ నగరంలోని కుర్దులను టర్కీ దన్నుతో సిరియాలో పోరాటం సాగిస్తున్న సేనలు వెళ్లగొట్టాయి. అనంతరం ప్రముఖ కుర్దు నాయకుడి విగ్రహాన్ని సేనలు నేలకూల్చాయి. టర్కీ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ మిలిటెంట్లను అంతమొందించేందుకు గత రెండు నెలలుగా సిరియాలో టర్కీ సేనలు వరుసగా దాడులు చేస్తున్నాయి.
అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకూ 280 సాధారణ పౌరులు మరణిచారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా ఆ ఆరోపణలను టర్కీ ఖండించింది. అంతకుముందు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ ఫ్రీ సిరియా ఆర్మీ సేనలు ఆఫ్రిన్‌ను ఆదివారం ఉదయం స్వాధీనం చేస్తున్నాయని ప్రకటించారు. సేనల దెబ్బకు ఉగ్రవాదులు ఒట్టి చేతులతో పారిపోతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment