Jihadists
-
‘విల్లు, బాణాలతో జిహాదీలను ఎదుర్కొందాం’
లక్నో: జిహాదీలు దాడి చేస్తే ఎదిరించడానికి హిందువులు ఇళ్లల్లో విల్లు బాణాలు సిద్ధంగా ఉంచుకోవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ పిలుపునిచ్చారు. తలపై టోపీలు, చేతిలో కర్రలతో ఉన్న ఓ గుంపు ఫొటోను ఆదివారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ‘‘ఈ మూక మీ వీధికి, మీ ఇంటికి అకస్మాత్తుగా వస్తే రక్షించుకోవడానికి మీకేదైనా మార్గం ఉందా? లేకపోతే ఏర్పాటు చేసుకోవాలి. మిమ్మల్ని కాపాడడానికి పోలీసులు రారు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఎక్కడో దాక్కుంటారు. జిహాద్ ముగిసి, మూక వెళ్లిపోయిన తర్వాతే వస్తారు. అలాంటి ‘అతిథుల’ కోసం రెండు బాక్సుల కూల్‌డ్రింక్ సీసాలను, విల్లులు, బాణాలను ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి’’ అని పోస్టు చేశారు. జైశ్రీరామ్ అంటూ ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఫేసుబుక్ పోస్టును సమర్థించుకున్నారు. సాక్షి మహారాజ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. -
వెలివేతతో ఇస్లామిక్ తీవ్రవాదానికి ఊతం
లండన్: ఇస్లామిక్ తీవ్రవాదం పేట్రేగిపోవడానికి సామాజిక బహిష్కరణ లేదా వెలివేత కూడా ఓ కీలక కారణమని తాజా అధ్యయనంలో తేలింది. మెడికల్ సైన్స్, న్యూరోఇమేజింగ్ పద్ధతుల ద్వారా తీవ్రవాదానికి ఆకర్షితులైన వ్యక్తులను విశ్లేషించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న నఫీస్ హమీద్ మాట్లాడుతూ..‘ సామాజిక బహిష్కరణకు గురైనప్పుడు తీవ్రవాదంవైపు మొగ్గుచూపే ఆలోచనలు పెరుగుతున్నాయని గుర్తించాం. 2017లో స్పెయిన్‌లోని లాస్ రమ్బ్లాస్ జిల్లాలో జరిగిన ఇస్లామిక్ స్టేట్ దాడిలో 13 మంది చనిపోగా దాదాపు 100 మంది గాయపడ్డారు. ఆ నేపథ్యంలో 535 మంది ముస్లిం వ్యక్తులను పరిశోధనకు ఎంపిక చేసుకున్నాం. ముగ్గురు సభ్యులు ఆడే వర్చువల్ గేమ్ ‘సైబర్ బాల్’లో వీరిని భాగస్వాములు చేశాం. ఆ ఆటలో ఇద్దరు స్పెయిన్ పౌరుల ముఖకవళికలతో ఉన్న ఆటగాళ్లు వీరిని నిర్లక్ష్యం చేసేలా చేసి వారి మెదళ్లను స్కాన్ చేయడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరించాం. ఇందులో పాల్గొన్న వ్యక్తులు పాఠశాలల్లో ఇస్లామిక్ బోధన, మసీదులు కట్టడం వంటి విషయాలు ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో 38 మంది మొరాక్ సంతతి వ్యక్తులు హింసను ప్రేరేపించేందుకు అంగీకరించారు’ అని పేర్కొన్నారు. -
క్రిస్టియన్ నగరంపై విరుచుకుపడ్డ జిహాదీలు
డమాస్కస్ : సిరియాలోని హమా, మహార్దా నగరాలపై ఆదివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) జిహాదీ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. అల్‌ఖైదా నేతృత్వంలో తీవ్రవాదాన్ని కొనసాగిస్తున్న ఉగ్ర సంస్థలు హాయత్ తహరీర్ అల్ షామ్, ఎఫ్‌ఎస్‌ఏలు సిరియా సైన్యానికి చెందిన మూడు చెక్ పాయింట్లపై బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఒక చెక్ పోస్టు పూర్తిగా ధ్వంసం కాగా, రెండు చెక్ పోస్టులు పాక్షికంగా నాశనమయ్యాయి. సైన్యం చెక్‌పోస్టులతో పాటు క్రిస్టియన్ నగరమైన మహార్దాపై ఒకే సమయంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మహార్దాపై క్షిపణుల వర్షం కురింపించారు. క్రిస్టమస్ వేడుకకు నగరం సిద్ధమవుతున్న సందర్భంలో దాడి జరగడంతో మహార్దా ప్రజలు షాక్‌కు గురయ్యారు. కాగా, ఉగ్రవాదుల దాడికి ప్రతిగా సిరియా, రష్యా ఫైటర్ జెట్లు ఉగ్ర ప్రభావం కలిగిన ప్రాంతాలపై బాంబు దాడులు చేశాయి. కాగా, జిహాదీలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉగ్రవాదులు చేసిన దాడిగా దీన్ని పరిగణిస్తున్నారు. -
చంపండి.. కానీ సింపుల్‌గా!
మోసుల్: ఒంటరి తోడేళ్ల(లోన్ ఊల్ఫ్స్)ను మరింత కర్కశంగా తయారుచేసే క్రమంలో ఐసిస్ కొత్త పంథాకు తెరతీసింది. ఇన్నాళ్లూ భారీ దాడులకు పాల్పడింది చాలని, ఇకపై అతిసాధారణ దాడులతో నరమేథం సృష్టించాలని పశ్చిమదేశాల్లోని తన జిహాదీలను ఆదేశించింది. 'విశ్వాసం లేని వాళ్లను చంపడంలో రాజీ పడొద్దు. కానీ ఆ పనిని హడావిడిగా కాకుండా సాధ్యమైనంత సింపుల్ గా, సమర్థవంతంగా చేయండి. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కుదిరితే అక్కడే వీలైనంత మేర రక్తపాతం సృష్టించండి. ఒకవేళ మీరు బయట తిరగలేని పరిస్థితుల్లో ఇళ్లల్లోకి దూరిమరీ కాల్పులు జరపండి. అంతేగానీ, భారీ స్కెచ్‌లు, హంగామా అదీ చెయ్యకండి' అంటూ ఐసిస్ తన అధికారిక పత్రిక 'దబీఖ్' ద్వారా సందేశం ఇచ్చింది. ప్రస్తుతం సిరియాలో ఉన్న ఓ అమెరికన్ జిహాదీ రాసినట్లుగా భావిస్తోన్న ఈ సందేశంలో.. 'మన స్థావరానికి (ఇరాక్-సిరియాకు) బయలేదేరే క్రమంలో మీకు అడ్డువచ్చిన ఎవ్వర్నీ వదిలిపెట్టొద్దు. ఒకవేళ మీరు ఇక్కడికి(సిరియాకు) రాలేకపోతే అదృష్టవంతులుగా భావించండి. ఎందుకంటే అక్కడికక్కడే విద్రోహులను చంపే అవకాశం లభిస్తుందిమీకు!' అనే ఆదేశాలు కూడా ఉన్నాయి. పశ్చిమదేశాలైన ఫ్రాన్స్, బ్రెసెల్స్, టర్కీ, జర్మనీలతోపాటు అమెరికాలోని ఓర్లాండోలోనూ భారీ నరమేథానికి పాల్పడ్డవారు స్థానిక జిహాదీలేనన్న సంగతి తెలిసిందే. కాగా, ఐసిస్ తదుపరి టార్గెట్ లండన్ నగరమేనని కొద్ది రోజులుగా వార్తలు వినిపించడం, ఇప్పుడా ఉగ్రవాద సంస్థ తన జిహాదీలకు ఆదేశాలు జారీచేయడం బ్రిటన్ ను కలవరపాటుకు గురిచేస్తున్నది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం లండన్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 600 మంది ప్రత్యేక సాయుధ బలగాలను మోహరించింది. -
ఐసిస్ పాశవికం: నీళ్లలో మరగబెట్టి చంపేశారు!
వేడివేడి నీటి చుక్క ఒక్కటి ఒంటిపై పడితేనే విలవిల్లాడిపోతాం. అలంటిది బతికున్న మనుషుల్ని బాగా మరగబెట్టిన నీళ్లలో ప్రాణాలు పోయేంతవరకు ఉడకబెట్టారు. విభిన్న తరహాలో శిక్షలు అమలు చేస్తూ ఇప్పటికే పైశాచికం పీక్స్ కు వెళ్లిన ఐసిస్ అగ్రనేతలు.. ఇప్పుడు తమ మాట వినని జిహాదీలను మరిగే నీళ్లలో ముంచుతున్నారు. ఇరాక్, సిరియాల్లోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్న ఐసిస్.. ఆ దేశాల భద్రతా దళాలతో నిత్యం తలపడుతూనేఉంది. జులై 4న బాగ్ధాద్ కు 60 కిలోమీటర్ల దూరంలోని లాహుద్దీన్ ప్రావిన్స్ లో ఇరాకీ దళాలతో ఐసిస్ ఉగ్రవాదులు తలపడ్డారు. ఓవైపు పోరు జరుగుతుండగానే ఐసిస్ కు చెందిన ఏడుగురు జీహాదీలు యుద్ధభూమి పారిపోయారు. ఆదేశాలు పాటించకుండా పలాయనం చిత్తగించిన ఆ ఏడుగురికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ లెవవన్ట్ (ఐఎస్ఐఎల్) మరణ శిక్ష విధించింది. బహిరంగ ప్రదేశంలో పొయ్యిని ఏర్పాటుచేసి, దానిపైన భారీ గిన్నెలో నీళ్లు మరిగించి ఏడుగురిని అందులో ముంచి చంపారు. ఐఎస్ తన జిహాదీలను చంపుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆదేశాలు పాటించని వారిని కర్కషంగా చంపిన సందర్భాలున్నాయి. అయితే నీళ్లలో మరగబెట్టి చంపడం మాత్రం ఇదే మొదటిసారి. గత నెలలో 19 మంది జిహాదీలను తుపాకితో కాల్చిచంపిన ఐసిస్ అగ్రనేతలు.. మే నెలలో మౌసూల్ పట్టణంలో 25 మంది అనుమానిత గూఢచారులను నైట్రిక్ యాసిడ్ లో ముంచి చంపేశారు. సిరియాలో పట్టుపడ్డ ఐదుగురు జర్నలిస్టులను గత నెల(జూన్ లో) పీకలుకోసి చంపారు. బందీలుగా చిక్కిన ఇతర జాతుల మహిళలను కూడా ఐసిస్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేస్తారు. చంపడం లేదా చావడం అనే నినాదం నుంచి చంపకపోతే చంపుతాం అనే బలవంతపు యుద్ధంలోకి యువకులను దించుతున్న ఐసిస్ నిజంగా ఓ రాక్షస బృందం. -
బాంబుల వర్షం.. 40 మంది ఉగ్రవాదులు హతం
ట్రిపోలి: లిబియాలో వైమానిక దాడులు తీవ్ర రూపం దాల్చాయి. శుక్రవారం గుర్తుతెలియని ఓ యుద్ధ విమానం గగనతలం నుంచి జరిపిన బాంబు దాడుల్లో సుమారు 40 మంది ఇస్లామిక్ మిలిటెంట్లు హతమై ఉంటారని లిబియా అధికారులు భావిస్తున్నారు. లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు సబ్రతా అనే ప్రాంతంలో ఓ ఇంట్లో సమావేశమయ్యారు. ట్యూనీషియా సరిహద్దులో ఉన్న ఐఎస్ఐఎస్ సభ్యలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానం బాంబులతో దాడిచేయగా 40 మందికి పైగా తిరుగుబాటుదారులు మృతిచెందారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులు సమావేశమైన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ట్రిపోలికి సరిహద్దుగా ఉన్న ట్యూనీషియా సమీపంలో ఈ దాడులు జరిగాయని హుస్సేన్ అల్ దవాదీ అనే అధికారి వెల్లడించారు. ట్యూనీషియాలో గతేడాది జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా తామే ఈ దాడులు చేశామని అమెరికా మీడియాకు అక్కడి అధికారులు వెల్లడించినట్లు సమాచారం. -
కళ్లు కూడా కనిపించడానికి వీలులేదు!
సిరియాలో మహిళలపై జీహాదీల ఆంక్షలు బీరుట్: సిరియాలో జీహాదీలు మహిళలపై కఠిన ఆంక్షలకు దిగారు. శరీరంలో ఏ అవయవం కనిపించడానికి వీలులేదని ఆంక్షలు విధించారు. శరీరంలో ఏ భాగం కనిపించని విధంగా వస్త్రధారణ ఉండాలని నిషేధాజ్ఞలు జారీ చేశారు. చివరకు కళ్లు కూడా కనిపించడానికి వీలులేదని ఆదేశించారు. రంగు రంగుల వస్త్రాలు ధరించకూడదు.వస్త్రాలపై పూసలు వంటి అలంకరణ వస్తువులు ఉండకూడదు. హైహీల్స్ చెప్పులు వాడకూడదు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు శిక్షలు కూడా విధిస్తారు. ఈ ఆదేశాలను జీహాదీల నియంత్రణలోని దీర్ ఎజ్జార్ ప్రాంతంలో జారీ చేసినట్లు సిరియా మానవ హక్కుల పరిశీలన సంస్థ తెలిపింది.