డమాస్కస్ : సిరియాలోని హమా, మహార్దా నగరాలపై ఆదివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) జిహాదీ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. అల్‌ఖైదా నేతృత్వంలో తీవ్రవాదాన్ని కొనసాగిస్తున్న ఉగ్ర సంస్థలు హాయత్ తహరీర్ అల్ షామ్, ఎఫ్‌ఎస్‌ఏలు సిరియా సైన్యానికి చెందిన మూడు చెక్ పాయింట్లపై బుల్లెట్ల వర్షం కురిపించాయి.
ఒక చెక్ పోస్టు పూర్తిగా ధ్వంసం కాగా, రెండు చెక్ పోస్టులు పాక్షికంగా నాశనమయ్యాయి. సైన్యం చెక్‌పోస్టులతో పాటు క్రిస్టియన్ నగరమైన మహార్దాపై ఒకే సమయంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మహార్దాపై క్షిపణుల వర్షం కురింపించారు. క్రిస్టమస్ వేడుకకు నగరం సిద్ధమవుతున్న సందర్భంలో దాడి జరగడంతో మహార్దా ప్రజలు షాక్‌కు గురయ్యారు.
కాగా, ఉగ్రవాదుల దాడికి ప్రతిగా సిరియా, రష్యా ఫైటర్ జెట్లు ఉగ్ర ప్రభావం కలిగిన ప్రాంతాలపై బాంబు దాడులు చేశాయి. కాగా, జిహాదీలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉగ్రవాదులు చేసిన దాడిగా దీన్ని పరిగణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment