సిరియా : ఐక్యరాజ్యసమితి రసాయన ఆయుధ తనిఖీ బృందం మళ్ళీ సిరియా చేరుకుంది. ఈ బృందం మార్చినెల 19న ఖాన్ అల్ అసాల్ పట్టణంపై జరిగిన రసాయన ఆయుధ దాడిపై దర్యాప్తు జరుపుతుంది. స్వీడన్ నిపుణుడు ఆకే సెల్‌స్టామ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
మరోవైపు.. అధ్యక్షుడు అసాద్ సేనలు సాగిస్తున్న దాడులకు దేశంలో నిలువలేక వలసపోతున్న సిరియన్ల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. గురువారం నాడు దేశ సరిహద్దలు దాటి వేల మంది సిరియన్లు ఇరాక్ చేరుకున్నారు. పెరుగుతున్న శరణార్దుల కోసం ఇరాక్ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.
సిరియాకు మళ్లీ ఐరాస తనిఖీ బృందం
Published Fri, Sep 27 2013 9:06 AM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM
Advertisement