సుఖ్బీర్కు ఈసారి గట్టి పోటినే..
జలాలాబాద్: పంజాబ్‌లో శిరోమణి అకాళీదల్ పార్టీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు గట్టి పోటీ ఎదురవనుంది. ఆయన పోటీ చేస్తున్న స్థానంలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న సిట్టింగ్ ఎంపీ భగవంత్ మన్, కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు కూడా ఇదే సీటుకోసం బరిలోకి దిగడంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. ఈ ముగ్గురు కూడా కీలక నేతలే.
ముఖ్యంగా బిట్టు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడు కాగా, పంజాబ్ రాజకీయాల్లో భగవత్ మన్కి గొప్పముద్ర ఉంది. మరోపక్క, సుఖ్బీర్ కూడా చాలా టఫ్ కాంపిటేషన్ ఇచ్చే వ్యక్తే. అయినప్పటికీ ఈసారి మాత్రం ఆయనే కఠిన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సుఖ్బీర్ 53,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే.