పెట్టుబడుల కోసమే...ఆస్ట్రేలియా పర్యటనకు జైట్లీ
మెల్బోర్న్: భారత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ నెల 28 నుంచీ ప్రారంభించనున్న ఆస్ట్రేలియా పర్యటన... పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా సాగనున్నదని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అధికార, వాణిజ్య ప్రతినిధి బృందంతో అరుణ్ జైట్లీ వచ్చే వారంలో నాలుగు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ధనిక సావరిన్ ఫండ్ పెట్టుబడుల ఆకర్షించడానికి భారత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా నాయకులు, పెట్టుబడిదారులతో జైట్లీ సమావేశం కానున్నారు. పర్యటన లక్ష్యం పూర్తిగా ఫలప్రదం అవుతుందని భావిస్తున్నట్లు ఇండియన్ హై కమిషనర్ నవ్‌దీప్ సూరీ తెలిపారు. తయారీ, సాంకేతికత, సేవలు, ఆర్థికం, వివిధ ఫండ్స్ ప్రతినిధులతో జైట్లీ సమావేశం కానున్నట్లు వెల్లడించారు.