tourist spots
-
అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతి..
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు కొత్త టూరిస్టు స్పాట్లు వెలుగు చూస్తున్నాయి. అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతిని పంచుతున్నాయి. పాల సంద్రాన్ని తలిపించే మంచు మేఘాలతో పాటు ఇప్పుడు హొయలొలికే కొత్త జలపాతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అంతెత్తునుంచి ఎగసిపడే జలసవ్వడులు సుమధుర సంగీత ఝరిలో జలకాలాడిస్తున్నాయి. వాటిని సందర్శించేందుకు పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు భారీగా తరలిస్తున్న సందర్శకులు అయిష్టంగానే తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. గూడెంకొత్తవీధి/అరకులోయ రూరల్: జిల్లాలో కొత్తగా వెలుగులోకి వస్తున్న టూరిస్టు స్పాట్లు సైతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి అన్నట్టు ఉన్న కొత్త ప్రాంతాలను టూరిస్టులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. అనంతగిరి, లంబసింగి, తాజంగి, చెరువులవెనం, పాడేరులోని వంజంగి మేఘాల కొండలే కాదు. అంతకు మించిన ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు అరకులోయ, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో చాలా ఉన్నాయి. సప్పర్ల రెయిన్ గేజ్ గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్పర్ల రెయిన్‌గేజ్ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ 24 గంటలూ అత్యంత శీతల వాతావరణంతోపాటు మంచు మేఘాలు చాలా కిందనుంచి సందర్శకులను తాకుతూ వెళుతుంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దారకొండ దారాలమ్మ ఆలయంతోపాటు సీలేరు వెళ్లే పర్యాటకులంతా తప్పనిసరిగా ఇక్కడ రెయిన్‌గేజ్ వద్దకు వెళ్లి కాసేపు ఉండి ఇక్కడ అందాలను ఆస్వాదిస్తారు. గతంలో అప్పటి ఉమ్మడి విశాఖ కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత సీజనులో దూరప్రాంతాలనుంచి ఇక్కడకు వస్తున్న పర్యాటకులసంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. రణజిల్లేడలో.. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో మరో అద్భుతమైన టూరిజం స్పాట్ చూపరులకు కనువిందు చేస్తోంది. పద్మాపురం పంచాయతీ రణజిల్లేడ జలపాతం ఇప్పటికే ప్రాచుర్యం పొందగా, దాని సమీపంలో అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను పరవశింప చేస్తున్నాయి. ఇక్కడి మంచు సోయగాలు, సూర్యోదయ అందాలు ఆకర్షిస్తున్నాయి. మాడగడలో వ్యూ పాయింట్ కొద్ది రోజుల నుంచి పర్యాటకులతో సందడిగా మారిన మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ సోమవారం పర్యాటకులతో కిటకిటలడింది. వివిధ ప్రాంతల నుంచి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు, తెల్లవారుజామునలో చల్లని వాతవరణంలో మంచు అందాలను వీక్షించి ఫొటోలు తీసుకుంటూ గడిపారు. మూడు కొత్త జలపాతాలు గూడెంకొత్తవీధికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లికి సమీపంలో దోనుగుమ్మల జలపాతం కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడికి వెళ్లేందుకు కొద్దిదూరం సీసీ రోడ్డు నిర్మిస్తే చాలు ఈప్రాంతానికి పర్యాటకంగా ఆదరణ లభించే అవకాశం ఉంది. దోనుగుమ్మల జలపాతానికి రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు తెలిపారు. జలపాతాలకు వెళ్లేందుకు రహదారి నిర్మాణానికి రూ.19లక్షలు మంజూరు చేసినట్టు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యరూపం దాల్చితే త్వరలోనే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సంపంగిగొంది జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అనంతగిరి మండలం చిట్టంపాడు జలపాతం ఇటీవల వెలుగుచూసింది. అక్కడికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. -
ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఆర్టీసీ ప్రవేశపట్టిన ‘హైదరాబాద్ దర్శిని’ సిటీ టూర్ బస్సుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి శని, ఆదివారాల్లో వీటిని నడుపుతారు. 12 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్ ఉంటుందని అధికారులు తెలిపారు. - శని, ఆదివారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి. - బిర్లామందిర్, చౌమొహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్‌లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. ఆ తరువాత దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఛార్జీలు ఇవే.. - మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 . - మెట్రో లగ్జరీ బస్సుల్లో.. పెద్దలకు రూ.450 , పిల్లలకు రూ.340 . -
టూరిస్ట్ స్పాట్స్‌లో ‘ఈ–సైకిల్’ పెట్రోలింగ్
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం నగర పోలీసు విభాగం గస్తీ కోసం ద్విచక్ర వాహనాలు, ఇన్నోవాలు వినియోగిస్తోంది. వీటికి తోడు ఒక్కో సబ్ డివిజన్లో ఒకటి చొప్పున ఇంటర్‌సెప్టర్ వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంగా పని చేస్తూ అత్యంత వేగంగా దూసుకుపోయేవి. వీటివల్ల కాలుష్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అశ్వక దళాన్ని వాడుతున్నా.. అన్ని సందర్భాల్లోనూ ఇది అనువైంది కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు ఈ–సైకిల్స్ సమీకరించుకోవాలని నిర్ణయించారు. బ్యాటరీ సాయంతో పని చేసే ఈ బై సైకిల్స్‌ను తొలి దశలో టూరిస్ట్ స్పాట్స్‌లో పోలీసింగ్, పెట్రోలింగ్ కోసం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఐఐటీ విద్యార్థులు టీ–హబ్‌లో ఏర్పాటు చేసిన స్టార్టప్ కంపెనీ ఓ తరహాకు చెందిన ఈ–సైకిల్‌ను రూపొందించింది. దీని పనితీరును కొత్వాల్ శుక్రవారం తన కార్యాలయంలో పరిశీలించారు. ఇవే మోడల్స్ లేదా ఇదే తరహాకు చెందిన ఈ–సైకిల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలి దశలో ట్యాంక్‌బండ్ చుట్టూ సంచరించే లేక్ పోలీసులతో పాటు కేబీఆర్ పార్క్, చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బృందాలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ సైకిల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 50 కి.మీ. నడుస్తుంది. ఒక్కసారి ఫెడల్ చేస్తే సార్టయ్యే ఈ బై సైకిల్ ఆగకుండా ముందుకు వెళ్తుంది. ఈ బై సైకిల్‌ను టూరిజం పోలీసింగ్‌తోపాటు బందోబస్తులు, ఊరేగింపుల సమయంలోనూ వినియోగించనున్నారు. గరిష్టంగా మూడు నెలల్లో వీటిని పోలీసు విభాగంలోకి తీసుకురావాలని భావిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. -
లైఫ్‌లో ఒక్కసారి!!
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం ఒన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్. జీవితంలో ఒకే ఒక్కసారి. మీ ఫ్యామిలీకి చూపించాల్సిన అద్భుతమైన కిక్కిచ్చే టూరిస్ట్ స్పాట్స్. ఎందుకంటే వరల్డ్స్ బెస్ట్ కూడా మీ ఫ్యామిలీ ముందు తక్కువే. గట్టిగా అనుకుంటే సాధ్యం కానిది ఏమీ ఉండదు. అదీ... మీ ఫ్యామిలీకి ఎక్సయిట్మెంట్ ఇచ్చే ఇలాంటి ఒకే ఒక్క టూరిస్ట్ స్పాట్ అయినా ప్లాన్ చేసుకోండి. లైఫ్‌లో ఒక్కసారి బ్రేక్ ద బోర్డమ్! మంథా రమణమూర్తి భాష ఏదైనా భావమొక్కటే. ‘లైఫ్‌లో ఒక్కసారి’ అని క్రీడాకారులు ఒలింపిక్స్‌లో అనుకుంటే... పర్వతారోహకులు ఎవరెస్టు దార్లో... నటీనటులు ఆస్కార్ థియేటర్లో అనుకునే మాట ఇది. సరే!! ఇలాంటి ప్రత్యేకతలేమీ లేని మామూలు జనం సంగతేంటి? మామూలు మనుషులు కూడా కాస్తంత ప్లానింగ్... కొంచెం వ్యయం చేస్తే ‘ఒకే ఒక్కసారి’ లాంటి కలలు నెరవేరుతాయా? నిజం!! ప్రపంచంలో కొన్ని ప్రాంతాలున్నాయి. జీవితంలో ఒక్కసారైనా అవి చూడాలి. కొన్ని సాహస కార్యాలున్నాయి. ఒక్కసారైనా చెయ్యాలి. కాకపోతే వీటికి మరీ ప్రత్యేకతలేమీ అక్కర్లేదు. కాస్తంత ధైర్యం. ఇంకాస్త సంకల్పం. అంతే!! అలాంటివి పరిచయం చేస్తున్నదే ‘సాక్షి’ ఈ ట్రావెల్ స్పెషల్... దూరంగా పొదల్లో ఏదో కదలిక. అంతలోనే చెట్లకొమ్మలు బలంగా ఊగుతాయి. అలా చూస్తుండగానే... చెట్ల చాటు నుంచి ఠీవిగా గజరాజు బయటికొస్తుంది. పర్వతం లాంటి దాన్ని చూశాక... ఈ జంతుకోటిలో మనమెంత చిరు ప్రాణులమో అర్థమవుతుంది. పులి, సింహం లాంటి మృగ రాజాలతో పాటు రకరకాల జంతువుల్ని నేరుగా, అతి దగ్గర నుంచి చూసే అవకాశం ఆఫ్రికన్ గేమ్ లాడ్జిల్లో మాత్రమే దొరుకుతుంది. అలాంటి గేమ్‌ను జీవితంలో ఒక్కసారైనా చూడాలని ఎవరికుండదు? ఎర్రటి ఇసుకలో కంటికి అందనంత వేగంతో ఎగిరెగిరి దూకే దుబాయ్ ఎడారి సఫారీ చెయ్యాలి. పెద్దయ్యేలోగా ఒక్కసారైనా డిస్నీలాండ్‌ను చుట్టేయాలి. ఆనందానికి కొలతలేంటో చెప్పే భూటాన్‌కు కుటుంబంతో సహా వెళ్లిరావాలి. ఇవన్నీ ‘ఒక్కసారైనా’ అనుకునే కేటగిరీలోనివే. ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఈజీగా చేర్చే రవాణా సౌకర్యాలిపుడు అందుబాటులోకొచ్చాయి. ఎక్కడి నుంచి ఏదైనా బుక్ చేసుకునే ఆన్లైన్ సదుపాయాలు మన ముందున్నాయి. ఇవన్నీ తెలీకుంటే... బాధ్యత మొత్తం మాకు వదిలేయండంటూ ముందుకొస్తున్న ట్రావెల్ సంస్థలూ బోలెడన్ని. నేడు ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’. ఈ సందర్భంగా కొన్ని స్పెషల్ టూర్లు, వాటి విశేషాలు. ఎడారి పరిగెడుతుంది దుబాయ్ సఫారీ దుబాయ్ ఎడారుల్లో ఇసుక గుట్టలపై నుంచి ఎగిరెగిరి పడే వాహనాల్లో సవారీ చేస్తే..! అది అనుభవించాలి తప్ప మాటల్లో చెప్పలేం. అసలు ఆ వేగానికి వాహనాల్లో కూర్చోవటమే కష్టం. మరి వాహనంలో నుంచి తల బయటకు పెట్టి ఓ సెల్ఫీ తీసుకుంటే!!. ఆ మజాయే వేరు. దుబాయ్ అందాల్ని, అక్కడి వాహనాల్ని చూడటం ఒకెత్తయితే... జీవితంలో ఇదే ఆఖరి రోజేమో అనేంత భయంతో పాటు జీవితానికి సరిపడే థ్రిల్‌ను అందించే ఎడారి సఫారీ మరో ఎత్తు. ఇక దుబాయ్‌కి వెళితే అక్కడి బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్లను చూడకుండా ఉంటామా? స్కై దుబాయ్ అనుభవం మిస్ అవుతామా? పామ్ జుమేరా, పామ్ ఐలాండ్స్‌ను చూడకుండా తిరిగొస్తామా? కాకపోతే మూడేళ్లలోపు పిల్లలు, బాగా వృద్ధులు, గర్భిణులు మాత్రం సఫారీని చూసి ఆనందించాలంతే!!. ఎలా వెళ్లాలి? దుబాయ్‌కి నేరుగా విమానాలున్నాయి. హైదరాబాద్ నుంచి బోలెడు విమానాలు. కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.10-12వేల మధ్యే ఉంటాయి. * సఫారీతో పాటు స్థానిక పర్యటనకు అక్కడి టూర్ ఆపరేటర్లపై ఆధారపడొచ్చు. స్థానిక ప్యాకేజీలైతే మనం ఎంచుకునే దాన్ని బట్టి, ఉండే రోజుల్ని బట్టి ఛార్జీలుంటాయి. ప్రారంభ ఛార్జీ ఒక వ్యక్తికి రూ.25వేలు. * విమాన ఛార్జీలు మినహాయిస్తే... దుబాయ్, అబుదాబి కలిపి ఒక వ్యక్తికి ఏడెనిమిది రోజుల ప్యాకేజీకి కొన్ని సంస్థలు రూ.35 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. రోజులు తగ్గితే ఈ మొత్తం తగ్గుతుంది. * సఫారీని మాత్రమే ఎంచుకుంటే ఒక మనిషికి రూ.13వేల నుంచి ప్యాకేజీలున్నాయి. వీటిలో పిక్ అప్, డ్రాప్ ఉండవు. వీటితో పాటు బస తదితరాలు కూడా కలిపితే ధరలు రూ.18 వేల నుంచి 20 వేల వరకూ ఉన్నాయి. ఏ సీజన్లో వెళ్లొచ్చు? * జనవరి, ఫిబ్రవరిల్లో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. ప్రపంచంలోని షాపింగ్ ప్రియులంతా అక్కడకు చేరుతారు. ఇది మంచి సీజన్. * ఏప్రిల్ నుంచి దుబాయ్‌లో వేసవి కాలం. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సెప్టెంబరు- అక్టోబరు వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. * నవంబరు నుంచి శీతాకాలం మొదలవుతుంది. అప్పటి నుంచి ఏప్రిల్ వరకూ మంచి సీజనే. కాకపోతే రద్దీ ఎక్కువ ఉండకూడదనుకునేవారు జనవరి, ఫిబ్రవరి నెలల్ని ఎంచుకోకపోవటమే మంచిది. -
నూతనోత్సాహం
= కొత్త సంవత్సరాదికి స్వాగత సన్నాహాలు = ముస్తాబైన బెంగళూరులోని ఎంజీ, బ్రిగేడ్ రోడ్లు = హోటళ్లు, పబ్‌లు, థెక్‌లు, రెస్టారెంట్లలో పలు కార్యక్రమాలు = సొమ్ము చేసుకుంటున్న యజమానులు = ఈ రోజు రాత్రి 8 నుంచే సంబరాలు = కిటకిటలాడనున్న పర్యాటక స్థలాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా కొత్త సంవత్సరాది వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులే వేడుకలకు ప్రధాన కేంద్రాలు. యువతీ యువకులు 31వ తేదీ రాత్రి అక్కడ చిందులు వేయడం ఆనవాయితీ. నగరంలోని హోటళ్లు, పబ్బులు, థెక్‌లు, రెస్టారెంట్లు వేడుకలకు సింగారించుకుంటున్నాయి. క్లబ్బుల సంగతి సరేసరి. తమ సభ్యుల కోసం వినోదభరిత కార్యక్రమాల కోసం చక చకా ఏర్పాట్లు చేస్తున్నాయి. సభ్యులు, వారి కుటుంబ సభ్యులు అర్ధ రాత్రి వరకు సంబరాలు జరుపుకోవడానికి అన్ని సదుపాయాలను కల్పించారు. రిసార్టులు, అమ్యూజ్మెంట్ పార్కుల్లో సైతం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సంబరాలు ప్రారంభం కానున్నాయి. క్లబ్బులలో ప్రముఖ సెలబ్రిటీలతో నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 31వ తేదీ రాత్రికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రిసార్టులు సొమ్ము చేసుకుంటున్నాయి. గదుల అద్దెను రెండింతలు పెంచేశాయి. వాటిల్లో మద్యం ధరలు ఆ రాత్రి చాలా ఘాటుగానే ఉంటాయి. శ్రీమంతులు కొత్త సంవత్సరాది వేడుకలకు ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక స్థలాలు, విదేశాలకు వెళుతుంటారు. ఇప్పటికే పర్యాటక స్థలాల్లోని హోటళ్లన్నీ రిజర్వు అయిపోయాయి. చివరి నిముషంలో ఎటో వెళ్లాలని నిర్ణయించుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. ఎక్కడా ఖాళీలు లేవని సమాధానం వస్తోంది. ట్రావెల్ ఏజెన్సీలకు చేతి నిండా పని. ఇక సొంత ఊళ్లలో సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించిన వారు సోమవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. దీంతో బస్టాండ్లన్నీ. బస్సు, రైలు టికెట్ల కౌంటర్ల వద్ద చాంతడంతా క్యూలు కనిపించాయి.