TPCC chief uttamkumar
-
‘మక్కా మసీదు పేలుళ్లలో దోషులు ఎవరు’
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు పేలుళ్ల కేసులో అందరూ నిర్దోషులే అయితే.. దోషులు ఎవరు అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దేశంలో న్యాయవ్యవస్థ ఉందా? లేదా? ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి మోదీని సీఎం కేసీఆర్ కలిసినప్పుడు రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ముస్లిం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందడం లేదని, షాదీ ముబారక్ అప్లికేషన్లు వేల సంఖ్యలో పెండింగ్ ఉన్నాయని విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ముస్లింలు టీఆర్ఎస్, ఎంఐఎంకు ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు. బీజేపీని ఓడించాలంటే ముస్లింలు కాంగ్రెస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ మైనారిటీ విభాగం చీఫ్ నదీమ్ జావేద్ మాట్లాడుతూ.. సోనియా, యూపీఏ వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ కేంద్రంలో మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ బయటకు మాత్రం బీజేపీపై పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ కాళ్లుపట్టుకున్న కేటీఆర్ ఇప్పుడు ఆమెపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. సిరిసిల్లలో కేటీఆర్, నిజామాబాద్లో కవిత ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
'సీఎం, స్పీకర్, గవర్నర్ అంతా విఫలం..'
హైదరాబాద్ : రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, గవర్నర్ నరసింహన్లు విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా నేతలతో గాంధీభవన్ లో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఎంపీ స్థానానికి మాజీ లోక్సభ స్పీకర్ మీరాకుమారిని దింపాలన్నది కేవలం కొందరు నేతల ప్రతిపాదన మాత్రమేనని, హైకమాండ్ కు ఈ విషయాన్ని తెలపలేదని ఉత్తమ్ అన్నారు. ప్రతిపక్షాలు, మేధావులు, మీడియా పట్ల కేసీఆర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ప్రొఫెసర్ కంచే ఐలయ్యపై పోలీసులు కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా తలసానిని కేబినెట్ నుంచి తప్పించాలని ఉత్తమ్ కోరారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం ద్వారా రాజీనామా వివాదం నుంచి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పించుకోలేరని కాంగ్రెస్ నేత గండ్ర పేర్కొన్నారు. తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, పార్టీ ఫిరాయించడం లేదని సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ కు రికమండ్ చేసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారని గండ్ర ఆరోపించారు. టీడీపీ నుంచి గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించారన్నారు. ఈ చట్టాన్ని పరిరక్షించే బాధ్యత స్పీకర్, గవర్నర్దేనని చెప్పారు. ఎంపీ పదవికి కడియం చేసిన రాజీనామాను లోకసభ స్పీకర్ ఆమోదించినప్పుడు.. తలసాని రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఎందుకు ఆమోదించరూ? అని గండ్ర ప్రశ్నించారు.