'సీఎం, స్పీకర్, గవర్నర్ అంతా విఫలం..' | TPCC chief uttamkumar meets with leaders in gandhi bhavan | Sakshi
Sakshi News home page

'సీఎం, స్పీకర్, గవర్నర్ అంతా విఫలం..'

Published Tue, Jul 21 2015 6:52 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'సీఎం, స్పీకర్, గవర్నర్ అంతా విఫలం..' - Sakshi

'సీఎం, స్పీకర్, గవర్నర్ అంతా విఫలం..'

హైదరాబాద్ : రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, గవర్నర్ నరసింహన్లు విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా నేతలతో గాంధీభవన్ లో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఎంపీ స్థానానికి మాజీ లోక్సభ స్పీకర్ మీరాకుమారిని దింపాలన్నది కేవలం కొందరు నేతల ప్రతిపాదన మాత్రమేనని, హైకమాండ్ కు ఈ విషయాన్ని తెలపలేదని ఉత్తమ్ అన్నారు. ప్రతిపక్షాలు, మేధావులు, మీడియా పట్ల కేసీఆర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ప్రొఫెసర్ కంచే ఐలయ్యపై పోలీసులు కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా తలసానిని కేబినెట్ నుంచి తప్పించాలని ఉత్తమ్ కోరారు.

వ్యక్తిగత ఆరోపణలు చేయడం ద్వారా రాజీనామా వివాదం నుంచి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పించుకోలేరని కాంగ్రెస్ నేత గండ్ర పేర్కొన్నారు. తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, పార్టీ ఫిరాయించడం లేదని సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ కు రికమండ్ చేసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారని గండ్ర ఆరోపించారు. టీడీపీ నుంచి గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించారన్నారు. ఈ చట్టాన్ని పరిరక్షించే బాధ్యత స్పీకర్, గవర్నర్దేనని చెప్పారు. ఎంపీ పదవికి కడియం చేసిన రాజీనామాను లోకసభ స్పీకర్ ఆమోదించినప్పుడు.. తలసాని రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఎందుకు ఆమోదించరూ? అని గండ్ర ప్రశ్నించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement