ట్రాక్టర్ ఢీకొని యువకుని మృతి
అవుకు: కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. అవుకు పట్టణంలో కిట్టయ్య(20) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.