Tractor roll
-
ట్రాక్టర్ బోల్తా.. నలుగురికి గాయాలు
తెనాలి : గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెంలో శుక్రవారం ఉదయం ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో కంచర్లపాలెం గ్రామానికి నలుగురు వ్యవసాయకూలీలకు గాయాలయ్యాయి. మొక్కజొన్న తోటలో పని చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు
కమలాపూర్ : కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామ శివారున ఉన్న చెరువులో ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టిని ట్రాక్టర్లో నింపుతుండగా ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్..మహిళ మృతి
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని మహానాడు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న లలిత కుమారి(32) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..మరో చిన్నారికి గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు రాజస్తాన్ నుంచి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడినట్లు తెలిసింది. -
ట్రాక్టర్ బోల్తా: వ్యక్తి దుర్మరణం
కందుర్తి: మట్టిలోడుతో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లాలోని కందుర్తి మండలం మహంతాపురంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మహంతాపురానికి చెందిన ఈరన్న (32) తన పొలంలో మట్టిని ట్రాక్టర్ లో తరలిస్తుండగా అదుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్‌పై ఉన్న ఈరన్న అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా: మహిళ మృతి, 12 మందికి గాయాలు
వేముల: వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి వద్ద ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లచెరువులోని భైరవ స్వామిని దర్శించుకోవడానికి వారంతో ట్రాక్టర్ లో వెళ్లారు. అనంతరం బుధవారం అర్థరాత్రి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన మహిళను వీరపునాయుని పల్లె మండలం బైళ్లచెరువు గ్రామానికి చెందిన సిరిగిరెడ్డి అలివేలమ్మ(55) గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా..20 మందికి గాయాలు
ఇంకొల్లు : ప్రకాశం జిల్లాలో ఓ పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని ఇంకొల్లు మండల సమీపంలో పెళ్లిబృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు, 15 మందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 40 మంది ఉన్నారు. క్షత గాత్రులను దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. -
ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువు కట్ట పై వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోతే మండలం విభలాపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన రైతు మైనంపాటి వీరారెడ్డి(45) పొలంలో ఉన్న పత్తిమూటలను తెచ్చేందుకు కూలీలతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పత్తిమూటల లోడుతో వస్తుండగా గ్రామంలోని చెరువు కట్టపై మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతు వీరారెడ్డి, కూలీ కొత్తపల్లి రమేష్(25)లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరారెడ్డికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమేష్‌కు కొద్ది నెలల కిత్రమే పెళ్లి అయింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (మోతే) -
ట్రాక్టర్ బోల్తా : ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
కడప : కడప జిల్లా చక్రాయ పేట మండలంలోని కే ఎర్రగుడి వద్ద మంగళవారం ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాగరాజు(28) అనే వ్యక్తి మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట అడవి నుంచి నల్లేరు మొక్కల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ముందు టైరు విరగడంతో రెండు పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే స్పందించి 108 కు సమాచారం అందించారు. గాయాలైన వారిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్నపోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (చక్రాయపేట) -
ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి మృతి
ములకలపల్లి, న్యూస్‌లైన్: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణంపాలైన సంఘటన ముల్కలపల్లి మండలంలోని రామచంద్రాపురం(గొల్లగూడెం) గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నరసింహాపురానికి చెందిన దానే సూరయ్య అనే రైతుకు చెందిన ధాన్యాన్ని అదే గ్రామానికి చెందిన బన్నే రాంబాబు ట్రాక్టర్లో రామచంద్రాపురానికి రవాణా చేశారు. ధాన్యం లోడుతో పాటు మామిళ్లగూడెం, నరసింహాపురం గ్రామాలకు చెందిన ఏడుగురు కూలీలు కూడా వెళ్లారు. అక్కడ ధాన్యం దింపేసి తిరిగి వారు ట్రాక్టర్‌పై స్వగ్రామాలకు వస్తుండగా రామచంద్రాపురం - చాపరాలపల్లి ఎస్సీ కాలనీల మధ్య మూలమలుపులో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న ధాన్యం యజమాని సూరయ్య కుమార్తె, నర్సింహాపురానికి చెందిన ఆళ్లూరి శ్యామల(40), ట్రాక్టర్ నడుపుతున్న మామిళ్లగూడేనికి చెందిన ఊకే ప్రసాద్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వారు గమనించి 108 సహాయంతో పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.