ట్రాక్టర్ బోల్తా: మహిళ మృతి, 12 మందికి గాయాలు
Published Thu, Nov 26 2015 9:43 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM
వేముల: వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి వద్ద ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లచెరువులోని భైరవ స్వామిని దర్శించుకోవడానికి వారంతో ట్రాక్టర్ లో వెళ్లారు. అనంతరం బుధవారం అర్థరాత్రి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన మహిళను వీరపునాయుని పల్లె మండలం బైళ్లచెరువు గ్రామానికి చెందిన సిరిగిరెడ్డి అలివేలమ్మ(55) గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement