ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్..మహిళ మృతి
Published Mon, Jan 11 2016 9:14 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని మహానాడు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న లలిత కుమారి(32) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..మరో చిన్నారికి గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు రాజస్తాన్ నుంచి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడినట్లు తెలిసింది.
Advertisement
Advertisement