అనంతపురంలో భారీ చోరీ
ధర్మవరం : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ధర్మవరం మండలం కేశవనగర్లోని ఓ వ్యాపారి ఇంట్లో ఆదివారం రాత్రి చోరికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే.... స్థానికంగా నివాసముంటున్న రమేష్ ఇంట్లోకి అర్థరాత్రి దొంగలు ప్రవేశించి 75 తులాల బంగారు నగలు, 2 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ. 1.65 లక్షలు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి బెడ్రూంలో నిద్రిస్తుండగా.. కిటికీలు తొలగించి దొంగతనానికి పాల్పడ్డారు. కుమారై పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగదు, నగలు చోరికి గురికావడంతో రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్టీంని రంగంలోకి దించి వివరాలు సేకరిస్తున్నారు.