అమ్మకు అశ్రునివాళి
► అమ్మ మరణంతో మూగబోయిన పల్లెలు
► శోక సముద్రంలో ప్రజలు
► వెల్ల్లివిరిసిన అభిమానం
► షాపులను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారుల నివాళి
గుమ్మిడిపూండి: రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణవార్త విని అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. 75 రోజులుగా అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత త్వరగా కోలుకుని పాలనా పగ్గాలు చేపట్టాలని వివిధ మతాల వారు ప్రత్యేక పూ జలు, ప్రార్థనలు చేశారు. అరుుతే జయలలిత ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా దిగ్భాంతికి గురయ్యారు. ఈ వార్తను టీవీలో చూసి అనేక మంది అమ్మ అభిమానులు గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం సాయంత్రం నుంచే బస్సులు, వ్యాపారసంస్థలు, ఆటోలు, పెట్రోల్ బంకులు మూసివేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు.
అమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే గుమ్మిడిపూండి, ఆరంబాక్కం, మాదరపాక్కం, పాదిరివేడు, కవరపేట, ఆరణి గ్రామాల్లో అమ్మ మృతికి సంతాపంగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి అమ్మపై ప్రేమను చాటుకున్నారు. అన్ని షాపులు, హోటల్స్, బస్సులు నిలిపివేయడంతో రోడ్లన్నీ బోసిపొయారుు, జనం అమ్మ గురించి ప్రసారమవుతున్న వార్తలను చూస్త్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. గుమ్మిడిపూండి జైహింద్ నగర్‌లోని డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. యూనియన్ కార్యదర్శి మణిబాలన్ అమ్మ ఫొటోకు మాలవేశారు. అలాగే స్థానిక నెహ్రూనగర్‌లోని తెలుగువారు జయలలిత ఫొటోకు నివాళులర్పించి ఆమె అత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలుగువారి కోసం అమ్మ చేపట్టిన సంక్షేమ పథకాలు గుర్తుచేసుకున్నారు.
అలాగే 38 వార్డు మాజీ కౌన్సిలర్ ఎస్.సంతానం బజారువీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరం వద్ద అమ్మ ఫొటోకు మాలవేసి దీపాలు వెలిగించారు. నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థారుుగా నిలిచారని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఎక్క డ చూసినాఅమ్మకు నివాళులర్పించి ఆమె ఆ త్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఆంధ్ర సరిహద్దు గ్రామం తడ వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు తమిళనాడులోకి వచ్చే వాహనాలను విసృ్తతంగా తనిఖీ చేసి పంపుతున్నారు. కాగా అమ్మ మరణవార్తతో ప్రజలు విషాదంలో మునిగిపోయారు.