traditional medicine
-
కీటకాలతో ఔషధం...హార్ట్ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది
ప్రస్తుతం గుండెపోటు మరణాలు ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు 50దాటిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ కోవిడ్ ఎఫెక్ట్‌తో కొంతకాలంగా దేశంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ చైనీస్ మెడిసిన్‌తో గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరి ఏంటా మెడిసిన్? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన ఘటనలు చూస్తున్నాం. డ్యాన్స్ చేస్తూనో, జిమ్ చేస్తూనో అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చినవారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. స్టెమీ(ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ STEMI)లాంటి తీవ్రమైన గుండెపోటు అటాక్ అయినప్పుడు ఈ తరహా పరిస్థితి ఎదురవుతుంటుంది. గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ అనంతరం గుండెపోటు కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీనికి తగ్గ కారణాలు, ఓషధాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో Tongxinluo అనే సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఈ మెడిసిన్ ప్రభావం సుమారు ఏడాది పాటు ఉంటుందని సైంటిస్టులు తెలియజేశారు. చైనాలో హార్ట్ స్ట్రోక్ వచ్చిన రోగులకు అందించే చికిత్సలో ఈ మెడిసిన్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది ప్రధానంగా జిన్సెంగ్, జలగ, తేలు, సికాడా, సెంటిపెడ్, బొద్దింక, గంధం సహా పలు సహజసిద్ధ మూలికలతో తయారు చేసిన ఓ సాంప్రదాయ ఔషధం. టెక్సాస్‌లోని UT సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్లో 3,777 మందిపై ఏడాదిపాటు జరిపిన పరిశోధనల్లో Tongxinluo మెడిసిన్ ఊహించని ప్రయోజనాలను నమోదు చేసిందని సైంటిస్టులు గుర్తించారు. Tongxinluo తీసుకోనివారితో పోలిస్తే, తీసుకున్నవారిలో హార్ట్ రిస్క్ 30% తక్కువగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. అంతేకాకుండా ఈ మెడిసిన్ వాడిన ఏడాది వరకు దాని ప్రయోజనాలు ఉన్నట్లు, దీనివల్ల 25% కార్డియాక్ డెత్ ప్రమాదం తగ్గిందని సైంటిస్టులు పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారు వివరించారు. -
భారత సంప్రదాయ ఔషధాలపై అంతర్జాతీయ సదస్సు..
హరిద్వార్: పతంజలి రిసెర్చ్ ఫౌండేషన్ అండ్ పతంజలి యూనివర్సిటీ హరిద్వార్‌లో ‘భారతీయ సంప్రదాయ ఔషధాలు: ఆధునికీకరణ’ అన్న అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. సొసైటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ ప్లాంట్, న్యూఢిల్లీ అలాగే నాబార్డ్, డెహ్రాడూన్ భాగస్వామ్యంతో జరిగిన ఈ సదస్సులో వైద్య రంగంలో నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆయుర్వేదంలో నిష్ణాతులు ఆచార్య శ్రీ బాలకృష్ణ జీ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక ఆవిష్కరణ కార్యక్రమంలో యోగా గురు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ తదితరులు. -
Traditional Chinese Medicines: చైనా మందులు మహా ప్రమాదం!
సంప్రదాయ వైద్యం ప్రపంచానికి కొత్తేం కాదు. ఆసియాలో అందునా.. చైనా సంప్రదాయ మందులకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ గిరాకీ ఉంది. ఈ తరుణంలో శాస్త్రీయ ఆధారాల్లేని ఈ మందుల గురించి భయంకరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ శాస్త్రీయతను విస్మరిస్తోందని, భద్రతా పరమైన సందేహాలకు ఇది తావిస్తోందని తాజాగా కొన్ని పరిశోధనలు బయటపెట్టాయి. న్యూయార్క్ స్టానీ బ్రూక్ యూనివర్సిటీలోని క్యాన్సర్ రీసెర్చర్ ఆర్థర్ గ్రోల్మన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. టీఎంసీ(Traditional Chinese Medicines)లో Aristolochic అనే యాసిడ్ ఉంటుందని, ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీస్తుందని వెల్లడించారు. ‘సేఫ్టీ కన్సర్న్స్ ఆఫ్ ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ ఇంజెక్షన్స్ యూజ్డ్ ఇన్ చైనీస్’ పేరిట ఆ రీసెర్చ్ నివేదిక వెలువడింది. ముఖ్యంగా టీసీఎం ఇంజెక్షన్లు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు రీసెర్చర్లు. క్లినికల్ ట్రయల్స్ లేకుండా, పక్షపాతమైన ధోరణిలో పరిశోధనతో వాటికి అనుమతి దొరుకుతోందని, ముఖ్యంగా పిల్లలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. టీసీఎం ప్రతికూల ఔషధ ప్రతిచర్యలు.. చైనాతో పాటు నైజీరియా, టాంజానియా, సౌతాఫ్రికాలోనూ కేసులు నమోదు అవుతున్నాయని ఈ పరిశోధనలు గుర్తించాయి. హాంకాంగ్‌కు చెందిన మార్గరేట్ ఛాన్ 2006 నుంచి 2017 మధ్య డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. టీసీఎంకు జబ్బులను నయం చేసే కీలకమైన ప్రాధాన్యం ఉన్న మెడిసిన్లుగా గుర్తింపు ఇచ్చింది ఆమె. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇక చైనా సంప్రదాయ మందుల వ్యాపారం ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా నడుస్తోంది. 1972 తర్వాత అమెరికా సైతం చైనాతో ఒప్పందం చేసుకోవడంతో.. ఈ వ్యాపారం గ్లోబల్ మార్కెట్‌గా మారింది. అయితే సంప్రదాయ మందుల తయారీ పేరిట మూగ జీవాలను ముఖ్యంగా అడవి జంతువుల్ని అక్రమంగా వేటాడి చంపడంపై అభ్యంతరాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా ఆరోపణలనీ, అగ్రరాజ్యం కుట్ర అని రీసెర్చ్‌ను చైనా తోసిపుచ్చుతోంది. -
ధన్యవాదాలు మోదీజీ: డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ‘కోవ్యాక్స్’ తయారీలో భారత చిత్తశుద్ధిని కొనియాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియేసస్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాని చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కరోనా.. ప్రపంచం ఎదుర్కొంటున్న గొప్ప సమస్య, ఈ సమస్య పరిష్కారానికి కావాల్సిన వ్యాక్సిన్ తయారిలో భారత్‌కు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. నరేంద్ర మోదీ, గ్యాబ్రియేసస్ సంప్రదాయ ఔషదల విషయమై బుధవారం ఫోన్లో సంభాషించారు. ప్రపంచానికి సంప్రదాయ ఔషదాల అవసరం ఎంతో ఉందని, వాటిపై మరింత పరిజ్ఞానం, పరిశోధనలు అవసరమని అందుకోసం పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. (కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత) కరోనా సమయంలో డబ్ల్యూహెచ్ఓ పాత్ర ముఖ్యమైనది కరోనా సమయంలో ప్రపంచం మొత్తాన్ని ఒక్కటి చేసి, మహమ్మారిని ఎదుర్కొనేందుకు డబ్ల్యూహెచ్ఓ చేసిన చర్యలను మోదీ కొనియాడారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరోగ్య ప్రమాణాల విషయంలో డబ్ల్యూహెచ్ఓ సహకారం ముఖ్యమైనదని చెప్పారు. రోగ నిరోధక శక్తి మెరుగుదలలో సంప్రదాయ ఔషదాలలో ఉన్న విలువల గురించి మాట్లాడారు. ప్రస్తుతం వైద్య విధానంలో సంప్రదాయ ఔషదాలను వినియోగించాల్సిన అవసరం ఉందని అందుకు సంబంధించిన నియమాలను, శాస్త్రవేత్తల నుంచి అనుమతి లభించగానే అందుకు ముందడుగు పడుతుందని మోదీ అన్నారు. దేశంలో నవంబర్ 13న ఆయుర్వేద దినోత్సావాన్ని జరపుతున్నామని ఈ సందర్భంగా ‘కరోనాకు ఆయుర్వేదం’ అనే అంశాన్ని ముందుకు తెస్తున్నట్లు మోదీ వెల్లడించారు. -
అంపశయ్యపై ‘ఆయుష్’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆయుష్ శాఖ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దేశీయ, సంప్రదాయ వైద్యం, ఆయుష్షు రోజురోజుకూ తగ్గుతోంది. ఆయుర్వేదిక్, హోమియో, యునాని, యోగా, సిద్ధదేశీయ వైద్యాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆయుష్ శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి వైద్యానికి ప్రజల్లో ఆదరణ ఉంది. ఆయుష్ శాఖలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర ఉద్యోగులు ఒక్కొక్కరు ఉద్యోగ విరమణ పొందుతుండడంతో ఖాళీలు ఏర్పడుతున్నారుు. రెగ్యులర్ డిస్పెన్సరీలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలు ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. రెగ్యులర్ డిస్పెన్సరీలో 18 ఏళ్ల కింద చేపట్టిన నియామకాలు మినహా... ఆ తర్వాత పోస్టింగ్‌లు లేవు. ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు దేశీయ వైద్యాన్ని అందించాలన్న చిత్తశుద్ధి గత పాలకుల్లో కొరవడడంతో ప్రజలకు దేశీయ, సంప్రదాయ వైద్యం అందని ద్రాక్షగా మారింది. నిలిచిన నియూమకాలు ఆయుష్ సేవలు విస్తృతం చేయడం, గ్రామీణ ప్రాంత ప్రజలకు దేశీయ వైద్యాన్ని చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం 2008-2009లో ఎన్ఆర్హెచ్ఎం ద్వారా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్న ప్రాంతాల్లో ఆయుష్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో నియామకాలు కూడా చేపట్టింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యులు, సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఆయుర్వేదిక్, యునాని, హోమియో, నేచురోపతి డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టింది. రెండు దశల్లో చేపట్టిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో మూడో దశ నియామకాలు నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆయుష్కు గుర్తింపునిచ్చి నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది. ఖాళీలు ఇలా.. వరంగల్‌లో ఉన్న ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలక కార్యాలయం(ఆర్డీడీ) పరిధిలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని ఆయుష్ డిస్పెన్సరీల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ డిస్పెన్సరీలకు సంబంధించి వరంగల్ ఆర్డీడీ పరిధిలో 185 ఆయుష్ డిస్పెన్సరీలు ఉంటే.. 43 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 181 కాంపౌండర్ పోస్టులకు 78 పోస్టులు భర్తీ కాలేదు. స్వీపర్/స్కావెంజర్ పోస్టులు 16, నర్సింగ్ ఆర్డర్లీస్ పోస్టులు 96 పోస్టులకు 15, ఏఎన్ఎంలు 9 పోస్టులకు 6, అటెండర్ 3 పోస్టులకు ఒకటి ఖాళీగా ఉన్నాయి. ఎన్ఆర్హెచ్ఎం కింద రెండు దశల్లో 178 డిస్పెన్సరీలు ఏర్పాటు చేశారు. 69 పోస్టుల్లో వైద్యులు ఉండగా, 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 178 కాంపౌండర్ పోస్టులకు 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 178 స్వీపర్/నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల్లో 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఎక్కువ సంఖ్యలో వైద్యులు, వైద్య సహాయకుల సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఆయుష్ సేవలు అందడం లేదు. తెలంగాణ ప్రభుత్వమైనా చొరవ తీసుకుని పోస్టులను భర్తీ చేయూల్సిన అవసరం ఉంది.