Traffic e-challan
-
తెలంగాణలో జోరందుకున్న పెండింగ్ చలానాల చెల్లింపులు
-
లాక్‌డౌన్‌లోనూ అప్‌లోనే!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ట్రాఫిక్ ఉల్లంఘనుల ముందు ఏమీ పనిచేయడం లేదు. గత ఎనిమిది రోజులుగా అంటే.. ఈ నెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో నమోదైన 2,55,934 ఉల్లంఘన గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. అంటే రోజుకు 31,991 మంది ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. చివరకు కేంద్రం ప్రకటించిన జనతా కర్ఫ్యూ రోజున సైబరాబాద్‌లో 8,947 ఈ– చలాన్ కేసులు, 85 కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ రోజు జనాలు ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పినా.. కొంతమంది ఈ విషయాన్ని పట్టించుకోలేదని ట్రాఫిక్ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. మారని తీరు.. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఇంట్లోనే ఉండాలని నెత్తీ నోరూ బాదుకుంటున్నా నిత్యావసరాల కోసం రోడ్డుపైకి ఎక్కుతున్న వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కలవరానికి గురిచేస్తోంది. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో జారీ చేసిన ఈ– చలాన్లలో ఎక్కువగా హెల్మెట్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్ ఉండటం కలవరానికి గురిచేస్తోంది. ముఖానికి కనీసం మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనచోదకులు కూడా ఉన్నారని పోలీసులు అంటున్నారు. సైబరాబాద్‌లో 1,25,076 ఈ చలాన్ కేసులు, 3256 లేజర్ గన్ కేసులు, సర్వై లెన్స్ కెమెరా మానిటరింగ్ సిస్టమ్ ద్వారా 2870 కేసులు, సోషల్ నెట్వర్క్ ద్వారా అందిన ఫిర్యాదులతో 862 కేసులు మొత్తంగా 1,22,064 ఈ– చలాన్లు జారీ చేశారు. కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అంటే పోలీసులే నేరుగా వాహనాలు ఆపి వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనల కింద 2,192 కేసులు నమోదుచేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 19,869 ఈ– చలాన్, 611 లేజర్‌గన్ కేసులు, సోషల్ నెట్వర్క్ ద్వారా అందిన ఫిర్యాదులతో 56.. మొత్తంగా 20,536 ఈ– చలాన్లు జారీ చేశారు. కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అంటే పోలీసులే నేరుగా వాహనాలు ఆపి వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనల కింద1,142 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,10,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. నిబంధనలు పాటించాల్సిందే.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి పరిమితికి మించి వాహనాలపై ప్రయాణిస్తుండటంతో కరోనా వ్యాప్తికి కారకులవుతారు. ఓ వైపు భౌతిక దూరం అంటూ చెబుతున్నా వాహనదారులు పాటించకపోవడం శోచనీయం. బైక్‌పై ఒక్కరూ, కారులో ఇద్దరికి మించి వెళ్లొద్దు. పరిమితికి మించి ప్రయాణికులతో పాటు హెల్మెట్ ధరించకపోవడం, కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ జంపింగ్, అధిక వేగంతో వాహనాలు దూసుకెళుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. అత్యవసరమైతే రోడ్లపైకి రావాలి. లేనిపక్షంలో ఇంట్లోనే ఉండటం మంచిది – సజ్జనార్, సైబరాబాద్ సీపీ మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇలా.. ♦ హైదరాబాద్ – 1,10,000 ♦ సైబరాబాద్ – 1,24,256 ♦ రాచకొండ – 21,678 -
ట్రాఫిక్ ఈ-చలాన్ వివరాలు తెలుసుకోండిలా..
‘ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లించని వారిపై చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో ప్రవేశ పెడతాం’ ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలు ఇవి. మరి మన వాహనంపై ఎన్ని చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి?.. వాటిని ఆన్లైన్లో ఎలా చెల్లించాలి?.. వాహనంపై వచ్చే ఈ-చలాన్ల వివరాలు మన మొబైల్‌కు వచ్చేలా ఏం చేయాలి?.. ట్రాఫిక్ ఈ-చలాన్ మొబైల్ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తదితర వివరాలు మీ కోసం. ఈ-చలాన్ వివరాలిలా... * ఇందుకు https://www.echallan.org/ లింక్‌ను క్లిక్ చేయండి. * ఇక్కడ కనిపించే ఆప్షన్ల వద్ద మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్, దానిపక్కనే పైన కోడ్ ఎంటర్ చేయండి. దాని పక్కనే ఉన్న ‘గో’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. * ఇప్పుడు మీ వాహనంపై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలు కనిపిస్తాయి. * మీరు ఎప్పుడు?.. ఎక్కడ?.. ఏ విధంగా?.. నిబంధనలు ఉల్లంఘించారనే వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. * అవసరమైతే మీ ఉల్లంఘనల దృశ్యాలను ఫొటోల రూపంలో చూడవచ్చు. * ఇందుకు ‘క్లిక్ ఫర్ ఇమేజ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. * ఇక మీ చలాన్ వివరాలను ప్రింట్ కూడా తీసుకోవచ్చు. * చలాన్‌ను నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ‘మీసేవ’ ద్వారా చెల్లించవచ్చు. తప్పుగా వస్తే... * ఒక్కో సందర్భంలో ఈ-చలాన్ తప్పుగా రావచ్చు. * తప్పుడు చలాన్ వచ్చినట్టు గుర్తిస్తే దాన్ని స్క్రీన్‌లో కింద కనిపించే ‘రిపోర్ట్ యాస్’ ఆప్షన్ క్లిక్ చేయాలి. * ఇక్కడ మీకు కనిపించే ఫీడ్ బ్యాక్ ఫారమ్‌లో.. మీ పేరు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ చిరునామాతోపాటుగా వచ్చింది మ్యాన్యువల్ ఎర్రర్ లేదా డబుల్ చలాన్ అనే విషయాన్ని ఎంచుకుని కింద మీ వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈమెయిల్‌కు ఈ-చలాన్ వివరాలు.. * మీ వాహనంపై వచ్చే ఈ-చలాన్ వివరాలను ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకు మీరు సంబంధిత సైట్లో రిజిష్టర్ కావాలి. * ఇందుకు https://www.echallan.org/publicview/ సైట్లో రిజష్టర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ కనిపించే రిజిష్టర్ ఫర్ వైలేషన్ అలర్ట్స్ ఫారమ్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ నమోదు చేయాలి. అదేవిధంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నంబరు, ఈమెయిల్ చిరునామా ఇవ్వాలి. రిజిష్టర్ అయిన తరువాత మీ వాహనం ఏదైన ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే వేంటనే మీ ఈమెయిల్‌కు అలర్ట్ వస్తుంది. యాప్ డౌన్లోడ్.. * తెలంగాణ స్టేట్ పోలీస్ వారు ఈ-చలాన్ వివరాలు, పేమెంట్ మొబైల్ ద్వారా చేసే విధంగా ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. * ఇందుకు https://play.google.com/store/apps/detailsid.com.glt.echallantelangana లింక్‌ను క్లిక్ చేయాలి. * ఈ యాప్‌ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. * ఈ యాప్‌లో మీ వాహన నంబర్ ఎంటర్ చేస్తే ఉల్లంఘన వివరాలు కనిపిస్తాయి. * ఉల్లంఘన పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్‌లో కనిపించే ‘ఎనలైజ్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేస్తే గ్రాఫ్ నమూనాలతో సహా వివరాలు కనిపిస్తాయి. ఠమీరు చలాన్‌ను మొబైల్ ద్వారానే చెల్లించవచ్చు.