trafic system
-
ఇక ట్రాఫిక్ కష్టాలకు చెల్లు.. ‘గూగుల్’ సాయంతో దూసుకెళ్లడమే!
బెంగళూరు: పెరిగిపోతున్న జనాభాతో పట్టణాల్లో ట్రాఫిక్ కష్టాలు సైతం పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటాం. అయితే.. ఆ సమస్యలకు చెక్ పెట్టనున్నారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. అందుకోసం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ సాయంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. అదేలా అంటారా?. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను త్వరలోనే గూగుల్‌తో అనుసంధానిస్తామని, దాని ద్వారా పెద్ద మార్పు రాబోతోందని పేర్కొంటున్నారు ఉన్నతాధికారులు. రోడ్లపై భారీగా వాహనాలతో ట్రాఫిక్‌ను నియంత్రించటం బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ట్రాఫిక్‌ను సులభంగా నియంత్రించి, కష్టాలను తీర్చేందుకు సాంకేతిక దిగ్గజం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలీసులు గూగుల్‌తో నేరుగా చేతులు కలపటం దేశంలోనే తొలిసారిగా పేర్కొన్నారు బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి. ‘నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించి, ఇబ్బందులు తప్పించేందుకు గూగుల్‌తో చేతులు కలపటం చాలా గర్వంగా ఉంది. ఇది లక్షల మంది ప్రయాణికులు రోజువారీ జీవనంపై సానుకూలు ప్రభావం చూపిస్తుంది. ఇటీవలే ట్రాఫిక్ లైట్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్ చేసే పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించాం. అది సిగ్నల్స్ వద్ద వెయిటింగ్ టైమ్‌ను చాలా వరకు తగ్గించింది. నగరంలో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యకు గూగుల్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాము. కృత్రిమ మేథా ద్వారా నగరంలోనే ట్రాఫిక్ ను అంచనా వేసి పోలీసుకు సమాచారం ఇస్తుంది గూగుల్. దాంతో కొత్త ప్లాన్‌ను అమలు చేస్తాం. ఇప్పటికే గూగుల్ ఇచ్చిన డేటా ప్రకారం.. ఇప్పటికే సుమారు 20శాతం వెయిటింగ్ టైమ్ తగ్గింది. సమయం తగ్గటమే కాదు.. ఇంధనాన్ని ఆదా చేస్తుంది, నగరంలో అనవసరం ట్రాఫిక్ జామ్‌లను నియంత్రిస్తుంది.’ అని పేర్కొన్నారు. బెంగళూరు నగరంలో కోటికిపైగా వాహనాలు ఉన్నాయి. త్వరలోనే అన్ని సిగ్నల్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్ చేస్తామన్నారు కమిషనర్. రహదారులపై ట్రాఫిక్ వివరాలను రియల్ టైమ్‌లో గూగుల్ అందిస్తుందని, ఆ సమచారాన్ని ప్రయాణికులకు అందించటం వల్ల ఇబ్బందులు తప్పుతాయన్నారు. అలాగే.. గూగుల్ మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్స్‌ను ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా ఓవర్ స్పీడ్లను కట్టడి చేయవచ్చన్నారు. ఇదీ చదవండి: Kochi: మొదట బుల్లెట్.. ఇప్పుడు బస్! స్టీరింగ్ ఏదైనా ‘లా’గించేస్తుంది! -
చుట్టేస్తే.చిక్కులుండవు
సిటీలో ‘ రోడ్డు బారికేడ్ల’తో సమస్యలు ట్రాఫిక్ నియంత్రణ కోసం పలుచోట్ల ‘రహదారుల’ మూసివేత నాన్-పీక్ అవర్స్‌లోనూ అదే పరిస్థితితో ఇబ్బందులు సిబ్బందికి సమస్యగా మారిన బారికేడ్ల ఏర్పాటు, తొలగింపు సూరత్ తరహా ‘ఫోల్డబుల్ బారికేడ్లు’ వాడితే సత్ఫలితాలు సిటీబ్యూరో: సిటీలో ట్రాఫిక్ జామ్స్ నిరోధించడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక ప్రాంతాల్లో ‘జంక్షన్ క్లోజింగ్’ ఫార్ములా అమలు చేస్తున్నారు. ప్రధాన రహదారులతో పాటు ఇతర రోడ్లలోనూ సమయంతో నిమిత్తం లేకుండా దీన్నే పాటిస్తున్నారు. ఆయా రూట్లలో వెళ్ళే వాహనచోదకులకు ఇబ్బందులు కలిగించే ఈ విధానానికి కారణం బారికేడ్లు. వీటిని నిత్యం ఏర్పాటు చేయడం, తొలగించడం సిబ్బందికి ఇబ్బంది కావడంతో రద్దీ ఉండని వేళల్లోనే ‘క్లోజింగ్’ అమలవుతోంది. గుజరాత్‌లోని సూరత్ పోలీసులు వినియోగిస్తున్న ఫోల్డబుల్ బారికేడ్లు ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారంతో పాటు వాహనచోదకులకు సమయం, ఇంధనం కలిసివస్తాయి. జంక్షన్లలో ఈ ఫార్ములా సక్సెస్... నగరంలో ‘మూసివేత’ ఫార్ములాను ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రధాన జంక్షన్ల నుంచి ప్రారంభించారు. సిటీలోని పలు చౌరస్తాలు సమయంతో నిమిత్తం లేకుండా నిత్యం రద్దీగా ఉంటాయి. వివిధ దిక్కుల నుంచి వచ్చిపోయే వాహనాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ‘రెడ్-గ్రీన్’ మధ్య గరిష్టంగా మూడు నిమిషాల సమయం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ చౌరస్తాలకు అన్ని వైపుల ఉన్న రోడ్లలో వాహనాలు బారులుతీరుతున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు జంక్షన్లను మూసివేయడంతో పాటు ‘ఫ్రీ-లెఫ్ట్’ ఇచ్చి... కొద్దిదూరం తర్వాత ‘యూ టర్న్’ ఇవ్వడం ప్రారంభించారు. అనేక చౌరస్తాలో ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో ఇదే విధానాన్ని విస్తరించిన ట్రాఫిక్ అధికారులు కొన్ని అంతర్గత రోడ్లలోనూ అమలు చేశారు. ‘అవర్స్’ తేడా లేకుండా అలానే... పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లో అంతర్గత రహదారుల్లోనూ ట్రాఫిక్ జామ్స్ నిరోధానికి ఈ చర్యలు తీసుకోవడం వరకు బాగానే ఉంది. అయితే జంక్షన్లు మూసేయడానికి ట్రాఫిక్ అధికారులు శాశ్వత ప్రాతిపదికన బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీటి ఫలితంగా నాన్-పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీలేని వేళల్లోనూ ఇదే పంథాలో వెళ్లాల్సి వస్తోంది. ఆయా ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనచోదకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. రద్దీ లేని వేళల్లోనూ ‘యూ టర్న్’ వరకు వెళ్లి తిరిగి రావాల్సి ఉండటంతో విలువైన ఇంధనం, సమయం వృధా అవుతున్నాయి. ఆయా బారికేడ్లను పదేపదే ఏర్పాటు చేయడం, తీయడం ట్రాఫిక్ సిబ్బందికి తలకు మించిన భారం కావడంతో అలానే వదిలేయాల్సి వస్తోంది. ‘సూరత్’ విధానంలో ఫలితాలు...గుజరాత్‌లోని సూరత్ నగర ట్రాఫిక్ పోలీసులు సాధారణ బారికేడ్ల స్థానంలో ఫోల్డబుల్ బారికేడ్లు వినియోగిస్తున్నారు. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లోనూ రద్దీ ఒకేలా ఉండదు. దీనికి తగ్గుట్టు అక్కడ మార్పుచేర్పులు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా ప్రాంతాల్లో ఫోల్డబుల్ బారికేడ్లు ఏర్పాటు చేసిన సూరత్ అధికారులు అవసరమైనప్పుడు వాటిని చుట్టేస్తున్నారు. వీటి తరలింపు సైతం సాధారణ బారికేడ్ల కంటే ఎంతో తేలికని అక్కడి అధికారులు చెప్తున్నారు. నగరంలోనూ ప్రధాన రహదారుల మినహా అంతర్గత ప్రాంతాల్లోని జంక్షన్లలో ఈ బారికేడ్లు ఉయుక్తంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో శాశ్వత బారికేడ్లు కాకుండా వీటిని ఏర్పాటు చేస్తూ రద్దీ వేళల్లో ఓపెన్ చేసినా... నాన్-పీక్ అవర్స్‌లో మళ్లీ చుట్టేసి పక్కన పెట్టే ఆస్కారం ఉంటుంది.