గాజులరామారంలో దారుణం
జీడిమెట్ల పీఎస్ పరిధిలో గాజులరామారంలో దారుణం చోటుచేసుకుంది. వీఎస్ఆర్ టవర్స్‌లో ఉంటున్న షేర్‌మార్కెట్ వ్యాపారి రమేష్‌వర్మ అనే వ్యక్తి తన భార్య, కొడుకును హత్య చేశాడు. తర్వాత ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్‌సాగర్‌లో దూకి అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. లేక్ పోలీసులు అతడిని కాపాడారు. అయితే స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాల కారణంగానే రమేష్‌వర్మ ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.