train crossing
-
భూమ్మీద నూకలు మిగిలేవున్నాయి..
దేవరియా : రైలు వెళ్లిపోతుందనే ఆందోళనతో ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తాను ఎక్కాల్సిన రైలు అవతలి ప్లాట్ ఫాంపై ఉండటంతో పట్టాలను దాటేందుకు అడ్డుగా ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి దూరి వెళ్లేందుకు యత్నించాడు. ఇంతలో ఓ గూడ్స్ రైలు కదలడంతో అలానే రైలు కింద పట్టాల మధ్య పడుకుండిపోయాడు. రైలు కింద ఉన్న ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయి.. గుర్తుపట్టలేనంత వీలుగా తునాతునకలై ఉంటాడని అక్కడున్నవారు భావించారు. అయితే రైలు వెళ్లిన అనంతరం అతను తాపీగా ఆ రైలు పట్టాలపై నుంచి లేచి వెళ్లిపోవడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియా రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఘటన మొత్తాన్ని ప్రయాణీకులు తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. పలు రైళ్ల నిలిపివేత
తాటిచెట్లపాలెం (విశాఖ): విశాఖ నగరం సమీపంలోని గోపాలపట్నం వద్ద మంగళవారం తెల్లవారుజామున పలు రైళ్లు నిలిచిపోయాయి. క్రాసింగ్‌లో ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మెరాయించింది. దాంతో విశాఖకు వచ్చే నరసాపురం ప్యాసింజర్ రైలు, గోదావరి, ఫలక్‌నుమా, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు సుమారు రెండు గంటల మేర గోపాలపట్నం వద్దే నిలిచిపోయాయి. ఉదయం 7.30 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ సిబ్బంది రంగంలోకి దిగి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సమస్యను సరిచేయడంతో రైళ్లు ముందుకు కదిలాయి.