దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. పలు రైళ్ల నిలిపివేత | narasapuram passenger train stopped at visakha station | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. పలు రైళ్ల నిలిపివేత

Published Tue, Jan 12 2016 8:25 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

narasapuram passenger train stopped at visakha station

తాటిచెట్లపాలెం (విశాఖ): విశాఖ నగరం సమీపంలోని గోపాలపట్నం వద్ద మంగళవారం తెల్లవారుజామున పలు రైళ్లు నిలిచిపోయాయి. క్రాసింగ్‌లో ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మెరాయించింది. దాంతో విశాఖకు వచ్చే నరసాపురం ప్యాసింజర్ రైలు, గోదావరి, ఫలక్‌నుమా, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు సుమారు రెండు గంటల మేర గోపాలపట్నం వద్దే నిలిచిపోయాయి. ఉదయం 7.30 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ సిబ్బంది రంగంలోకి దిగి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సమస్యను సరిచేయడంతో రైళ్లు ముందుకు కదిలాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement