భూమ్మీద నూకలు మిగిలేవున్నాయి.. | In Uttar Pradesh, Train Passes Over Man. He Walks Away Unhurt | Sakshi
Sakshi News home page

భూమ్మీద నూకలు మిగిలేవున్నాయి..

Published Wed, Nov 22 2017 12:26 PM | Last Updated on Wed, Nov 22 2017 12:26 PM

In Uttar Pradesh, Train Passes Over Man. He Walks Away Unhurt - Sakshi

దేవరియా : రైలు వెళ్లిపోతుందనే ఆందోళనతో ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తాను ఎక్కాల్సిన రైలు అవతలి ప్లాట్‌ ఫాంపై ఉండటంతో పట్టాలను దాటేందుకు అడ్డుగా ఉన్న గూడ్స్‌ రైలు కింద నుంచి దూరి వెళ్లేందుకు యత్నించాడు. ఇంతలో ఓ గూడ్స్‌ రైలు కదలడంతో అలానే రైలు కింద పట్టాల మధ్య పడుకుండిపోయాడు.

రైలు కింద ఉన్న ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయి.. గుర్తుపట్టలేనంత వీలుగా తునాతునకలై ఉంటాడని అక్కడున్నవారు భావించారు. అయితే రైలు వెళ్లిన అనంతరం అతను తాపీగా ఆ రైలు పట్టాలపై నుంచి లేచి వెళ్లిపోవడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని దేవరియా రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన మొత్తాన్ని ప్రయాణీకులు తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement