train doors
-
ఫోటో తీసుకుందామని వందే భారత్ ట్రైన్ ఎక్కాడు..డోర్లు లాక్ అవ్వడంతో..
రాజమహేంద్రవరం: ‘ఎరక్కపోయి ఇరుక్కున్నాడు’ అనే సామెత తాజా ఘటనకు అచ్చం సరిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ట్రైన్ పట్టాలెక్కి ఇంకా రెండు రోజులు కాలేదు.. ఒక వ్యక్తి ఫోటో కోసం ట్రైన్ ఎక్కేశాడు. సెల్పీ తీసుకుందామని భావించి ట్రైన్ స్టేషన్లో ఆగిన వెంటనే అందులోకి అమాంతం దూకేశాడు. చకచకా సెల్పీలు తీసుసుకున్నాడు. కానీ ట్రైన్ డోర్లు ఆలోమేటిక్‌గా లాక్ అవుతాయనే విషయం గ్రహించలేకపోయాడు. అంతే డోర్లు లాక్‌తో ట్రైన్లో ఇరుక్కుపోయి ఫైన్ చెల్లించుకున్నాడు. అంతే కాదు.. మళ్లీ స్టాప్ వచ్చే వరకూ మనోడి దిగే పరిస్థితి లేకుండా పోయింది. వందే భారత్ ట్రైన్ రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో ఆగిన సమయంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ట్రైన్ ఎక్కేశాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. ఈ లోపు డోర్లు లాక్ అయిపోయాయి. అంతే ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటూ చూసినా చేసే పరిస్థితి ఏమీ లేకుండా పోయింది. ఈలోపు టీసీ వచ్చి టికెట్ అడిగేసరికి అసలు విషయం బయటపెట్టాడు. తాను ఫోటోలు కోసం ట్రైన్ ఎక్కానని, డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయనే విషయం తెలియదన్నాడు. టీసీ కూడా తాను కూడా ఏమీ చేసే పరిస్థితి లేదని, వచ్చే స్టేషన్ వరకూ ఆగాల్సిందేనని చెప్పేశాడు. దాంతో పాటు జరిమానా కూడా విధించాడు టీసీ. ఇక చేసేది లేక ఫైన్ చెల్లించాడు మనోడు. రాజమండ్రిలో ట్రైన్ ఎక్కినవాడు చివరకు విజయవాడలో దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఫోటో తీసుకుందామని వందే భారత్ ట్రైన్ ఎక్కాడు..డోర్లు లాక్ అవ్వడంతో..
-
రైళ్లలో ఆటోమేటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల భద్రత కోసం రైళ్ల తలుపులు వాటంతట అవే మూసుకుపోయే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. ట్రైన్ గార్డులు.. వారి కేబిన్ నుంచే ఈ డోర్లను ఆపరేట్ చేసేలా వీటిని రూపొందిస్తున్నారు. ఫుట్‌బోర్డుల వద్ద నిలుచుని ప్రయాణికుల ఆభరణాలను లాక్కెళ్లటం, నడుస్తున్న రైల్లోంచి దిగే ప్రయత్నంలో పట్టాలపై పడటం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకే రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి ప్రయత్నంగా రెండు రాజధాని, రెండు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైళ్లలో తలుపులు తెరవడం, మూయడం మాన్యువల్ గా జరుగుతోంది. -
ఇక రైలు తలుపులు మూసుకుపోతాయి!
న్యూఢిల్లీ: తలుపులు వాటంతట అవే మూసుకుపోయే సౌకర్యం రైళ్లలో అందుబాటులోకి రానుంది. బుల్లెట్, హైస్పీడ్ రైళ్లలో అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం మన రైళ్లలోనూ రానుంది. ఈ మేరకు 2014-15 రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదించారు. ప్రధాన రైళ్లు, సబర్బన్ మార్గాల్లో రైలు బయల్దేరే ముందే తలుపులు మూసుకుపోయేలా వ్యవస్థ ఏర్పాటుచేస్తామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. స్టేషన్ వచ్చినప్పుడు వాటంతట అవే తలుపులు తెరుకుంటాయి. సమయాన్ని ఆదా చేసేందుకు ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలును ప్రవేశపెడతామని చెప్పారు.