రైలు ప్రయాణికుల భద్రత కోసం రైళ్ల తలుపులు వాటంతట అవే మూసుకుపోయే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు.
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల భద్రత కోసం రైళ్ల తలుపులు వాటంతట అవే మూసుకుపోయే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. ట్రైన్ గార్డులు.. వారి కేబిన్ నుంచే ఈ డోర్లను ఆపరేట్ చేసేలా వీటిని రూపొందిస్తున్నారు. ఫుట్‌బోర్డుల వద్ద నిలుచుని ప్రయాణికుల ఆభరణాలను లాక్కెళ్లటం, నడుస్తున్న రైల్లోంచి దిగే ప్రయత్నంలో పట్టాలపై పడటం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకే రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
తొలి ప్రయత్నంగా రెండు రాజధాని, రెండు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైళ్లలో తలుపులు తెరవడం, మూయడం మాన్యువల్ గా జరుగుతోంది.