పట్టాలు తప్పిన భద్రత
సందర్భం
డా॥బలిజేపల్లి శరత్‌బాబు, ప్రధాన శాస్త్రవేత్త, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, హైదరాబాద్
అనంతపురం జిల్లా కొత్త చెరు వు- పుట్టపర్తి స్టేషన్ల మధ్య నాం దేడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు ఇటీవల సంభవించిన అగ్ని ప్ర మాదం కొత్త భయాలను సృష్టి స్తోంది. 64 మంది ప్రయాణి కులు ఉన్న ఏసీ బి1 బోగీకి నిప్పంటుకుని 26 మంది మర ణించారు. తరవాత పరిహారాల ప్రకటన, పరామర్శలు మొక్కు బడిగా జరిగిపోయాయి. గడ చిన రెండేళ్లలో రైళ్లలో అగ్ని ప్రమాదాలు రెండింతలైనా యంత్రాంగం స్పందన ఇంత చప్పగా ఎందుకుందో అర్థం కాదు. రైల్వే అధికార సమాచారం ప్రకారం ఏటా సంభవిం చే మొత్తం రైలు ప్రమాదాలలో నమోదవుతున్న మరణా లలో, అగ్నిప్రమాదాల మృతులు 2 శాతం. దేశంలో చోటు చేసుకుంటున్న అసహజ మరణాలలో రైల్వే ప్రమాదాల మృతుల వాటా 7.8 శాతం. మామూలు ప్రమాదాలకు తోడు 2010-2013 మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు ఏటా రెట్టింపు వంతున పెరిగాయి.
రైలు ప్రమాదాల నివారణలో ఆ యంత్రాంగానికి గురుతర బాధ్యత ఉన్న మాట నిజమే. కానీ అందులో ప్రయాణికులకూ పాత్ర ఉంది. నాందేడ్-బెంగళూరు ఎక్స్ ప్రెస్‌కు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవ చ్చునని అధికారులు చెబుతున్నారు. దీనితో పాటు రసా యనాలతో కూడిని కొన్ని సీసాలు బోగీలో ఉన్నట్టు అను మానాలు ఉన్నాయి. ఇవన్నీ విచారణలో తేలవచ్చు. మన రైలు ప్రమాదాల చరిత్రచూస్తే మానవ తప్పిదాలు, ప్రయా ణికుల ఉదాశీనత, నిర్లక్ష్యం కూడా వాటికి కారణమైన సంగతి బోధపడుతుంది.
కకోడ్కర్ సిఫారసులు ఏమైనట్టు?
రైళ్లలో మంటలు లేచిన వెనువెంటనే ఆ ప్రమాదాన్ని గుర్తించే వ్యవస్థను బోగీలలోనే ఏర్పాటు చేయాలని అనిల్ కకోడ్కర్ అధ్యక్షతన ఏర్పాటయిన రైల్వే భద్రత సమీక్షా సంఘం ఫిబ్రవరి 2012లో సిఫార్సు చేసింది. భద్రతా ప్రమాణాల పెంపు అవసరాన్ని ఇవి చెప్పక చెబుతున్నా యి. ప్రస్తుతం మనం నమ్ముకుంటున్న పొడి రసాయన పౌడర్ల ఆధారంగా మంటలార్పే వ్యవస్థ శుద్ధ నిరుప యోగమని తేల్చి చెప్పింది. అత్యవసర ల్యాండింగ్ జరిగిన సందర్భాలలో భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రయాణికు లను విమానం నుంచి కేవలం 90 సెకన్లలోనే వెలికి తీసు కురావాలి. కకోడ్కర్ కమిటి చెప్పిన ట్టు, రైళ్లలో ఇటువంటి ప్రమాణాలు లేవు. పైగా రైళ్లలో ప్రయాణికులు ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఏర్పాటు చేసే అత్యవసర ద్వారాలు, కిటికీలపై ఇప్పటి వరకు దృష్టి సారించిన జాడ లేదు.
స్వతంత్రంగా ఒక నియంత్రణా వ్యవస్థ లేకపోవ డాన్ని కూడా ఆ కమిటి తప్పు పట్టింది. రైల్వ్థేలో అంతర్గత సంఘర్షణ నెలకొని ఉన్నది. నిబంధనల తయారీ, ప్రాథ మిక కార్యకలాపాలు, నియంత్రణాధికారాలు అన్నీ కూడా రైల్వే బోర్డు చేతికే ఇచ్చారు. ప్రత్యేక గుర్తింపు ఉన్నప్ప టికీ,ఏ ఒక్క కమిటి ప్రతిపాదనలు కూడా రైల్వే బోర్డు అమలుచేయలేని దయనీయ స్థితిలో ఉంది. రైల్వే కమిష నర్లు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నియంత్రణలో పేరుకు మాత్రమే ఉన్నారు గాని, కార్యకలాపాల స్థాయిలో మాత్రం వాళ్ల పాత్ర దాదాపు శూన్యమే. ‘రైల్వే భద్రతా ప్రాధికార సంస్థ’ ఏర్పాటు పని సత్వరం జరగాలని, ప్రస్తుత లైన్ల పునరుద్ధరణ, నూతన లైన్ల నిర్మాణం జరగ కుండా కొత్త రైళ్లను ప్రవేశపెట్టవద్దని కూడా కకోడ్కర్ కమిటి హెచ్చరించింది. ఈ రెండు ముఖ్య సిఫార్సులను కూడా రైల్వే మంత్రిత్వశాఖ గాలికి వదిలివేసిందనే ఎక్కువ మంది అభిప్రాయం. కకోడ్కర్ కమిటి పరిశీలనలో తేలి నట్టు, రైళ్లలో భద్రత ఆందోళనకరమైన స్థితిలోనే ఉంది. రిజర్వుడు బోగీలలో కూడా టిక్కెట్లు లేని ప్రయాణికులు చేరుతున్నారు. వీళ్లని అధికారులు చూసీచూడకుండా వది లేయడంతో మొత్తం ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమ వుతోంది. రైలు స్టేషన్ విడిచి పెట్టాక, ముఖ్యంగా రాత్రి వేళల్లో టిక్కెట్ ఎగ్జామినర్లు, రక్షణ సిబ్బంది సాధారణంగా కనబడరు.
ప్రయాణికులకూ బాధ్యత
ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రయా ణికులు తమ వంతు కర్తవ్యం నిర్వహించాలి. పెట్రో ఉత్ప త్తులు, ఫిల్మ్‌లు, టపాసులు, గ్యాస్ సిలిండర్లు వంటి సుల భంగా మండే వస్తువులతో ప్రయాణం చేయకూడదన్న కనీస స్పృహ ఉంచుకోవాలి. రైళ్లలో సిగరెట్లు కాల్చరాదనే ఆంక్షలు ఉన్నాయి. బోగీల కారిడార్లలో అడ్డంగా సామాన్లు పేర్చుకుంటూ పోయే అలవాటు ఇప్పటికీ ఉంది. వీటితో అత్యవసర సమయాల్లో, సామాన్లు పెట్టిన వారితో సహా, ఎవరూ బయట పడలేకపోవచ్చు. ఇలాంటి మామూలు జాగ్రత్తలు, అధికారికంగా ఇచ్చే ఆంక్షలు, మార్గదర్శకా లను ప్రయాణికులు గాలికి వదిలేయడమూ వాస్తవమే.
కమిటీలు, నివేదికలు, దిద్దుబాటు చర్యలు కాగితాలకు పరిమితమవుతాయేగాని, ఆచరణలో కానరావు. ఈ పరిస్థి తికి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేక పోవడమే కారణం. రైలు ప్రయాణికులలో సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వారే ఎక్కువ. ప్రభుత్వ, రాజకీయ, అధికార వర్గాలను ప్రభావితం చేయగలిగిన వారు కాదు.
వ్యవస్థ నిర్లక్ష్యాన్నీ, బాధ్యతారాహిత్యాన్నీ ప్రశ్నించలేని అసమర్థులని అన్ని అధికార వ్యవస్థలలోను పాతుకు పోయిన సర్వసాధారణ భావన. వీళ్లు కూడా మనుషులే ననీ, దీపపు పురుగులు కాదనీ గుర్తిస్తే, కొద్దిగా స్పందిస్తే అన్ని రకాల రైలు ప్రమాదాలు, ముఖ్యంగా అగ్ని ప్రమాదా లను కొంతవరకైనా ఆపగలిగే వాళ్లు. దారుణ మరణ బాధకు వారిని గురి చేసేవారు కాదు. రైలు ప్రయాణికుల భద్రత కోసం కేటాయిస్తున్న నిధులు ప్రతి ఏటా అలాగే మిగిలిపోతున్నాయంటేనే, మన వ్యవస్థలో పేద, మధ్య తరగతి ప్రజల ప్రాణాలకు ఉన్న విలువ ఏ పాటిదో అర్థమ వుతుంది. కాగ్ ఇటీవలి తన నివేదికలో రైల్వే భద్రతా వ్యవస్థల ఏర్పాటు కోసం కేటాయించిన రూ. 670 కోట్లకు పైగా నిధులు ఖజానాలోనే మూలుగుతున్నాయనీ, వాటి ని నిరుపయోగంగా ఉంచారనీ విమర్శించింది.
మొబైల్స్‌తోనూ ముప్పే
ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లు కూడా ప్రమాదకరంగా పరిణ మించాయి. వాటి చార్జింగ్ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థతో కేబుల్ వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. వాటి తో స్పార్కులు, షార్ట్ సర్క్యూట్లు సహజం. ఇంత చిన్న అంశాన్ని కూడా రైల్వే అధికారులు ఎందుకు పరిగణ నలోనికి తీసుకోరు? స్టేషన్లలో ప్రవేశించడానికి, ముఖ్యం గా రాత్రి వేళల్లో ఎటువంటి నియంత్రణ ఉండడం లేదు. ఇది దారుణమైన భద్రతా లోపం. అమాయక ప్రయాణికు లతోపాటు, దొంగలు, విచ్చిన్నకరశక్తులు యథేచ్ఛగా లోప లికి ప్రవేశించవచ్చు. ఏమైనా చేయవచ్చు. రెండవ తరగతి స్లీపర్ కార్లలో 72 మందికి నాలుగే నాలుగు మరుగుదొడ్లు ఉంటాయి. అత్యవసర ద్వారాల తీరు కూడా హాస్యాస్ప దం.
అత్యవసర సమయాల్లో ప్రాణాలు దక్కించుకోవా లంటే ఇవే ద్వారాల నుంచి, అంటే 8 అడుగుల ఎత్తు నుం చి కిందకు దూకవలసి ఉంటుంది! ఇది కూడా ప్రాణాం తకమే. సామర్థ్యం కంటె అనేక రెట్లు ఎక్కువగా ప్రయా ణాలను అనుమతించే సాధారణ బోగీల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏం జరుగుతుందో ఊహించలేం. ఇప్పటికైనా కోచ్‌ల తయారీలో ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
బోగీలలో నిరంతర సమాచార వ్యవస్థను ఎందుకు ఏర్పరచుకోలేకపోతున్నామో అర్థం కాదు. బోగీల లోపలి ద్వారాలు లోహంతో కాకుండా గాజుతో నిర్మించాలి. అప్పుడే జామ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. బోగీల్లో పొగను గుర్తించి ఆటోమేటిక్‌గా రైలు బండి ఆగిపోగల వ్యవస్థను, అగ్ని ప్రమాదం సంభవించినపడు కూడా ప్రయాణికులు సులభంగా ఊపిరి పీల్చుకునే విధంగా, వ్యాపించిన పొగను వెంటనే తొలగించే వ్యవస్థ అవస రాన్ని కూడా రైల్వే గుర్తించాలి. ప్రపంచ గర్వించేలా మనం అంతరిక్ష పరిశోధన ఫలితాలు సాధించుకున్నాం. దేశ భద్ర తలో రాజీలేకుండా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకు న్నాం. కానీ రైలు ప్రయాణికుల భద్రతలో ఇంత వెనుకబడి ఉండడం దారుణం.