నిలిచిన గూడ్స్ రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం
విశాఖపట్నం: సాంకేతిక లోపంతో గూడ్స్ రైలు గుల్లిపాడు - నర్సీపట్నం మధ్య నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నగరానికి చేరవలసిన గోదావరి, విశాఖ, గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ తుని వద్ద నిలిచిపోయాయి. దీంతో సదరు రైళ్లలోని ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గూడ్స్ ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.