Trainee collector
-
మంగ్లీ గ్రామాన్ని సందర్శించిన ట్రైనీ కలెక్టర్
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని వాన్వాట్ గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన మంగ్లీ గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్ పి.శ్రీజ కాలినడకన వెళ్లి శుక్రవారం సందర్శించారు. గ్రామానికి గతంలో గవర్నర్ అసిస్స్టెట్ నిధుల నుంచి రూ.10లక్షలతో ఎస్టీ కమ్యూనిటీ హాల్, మరో రూ.11లక్షలతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. వర్షాలు ప్రారంభమైతే గ్రామ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్లడం కష్టామని, అప్పటిలోగా తాత్కాలిక రోడ్డు వేయించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. స్పందించిన ఆమె ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తాత్కాలిక రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి మామిడిగూడలోని సబ్ సెంటర్‌ను సందర్శించిన ఆమె మంగ్లీ గ్రామంలో వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చిన్నారులతో పాటు గర్భిణులకు వైద్య పరీక్షలు చేయాలని వైద్యులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఆమె వెంట ఏఈఈ సలావుద్దీన్, కాంట్రాక్టర్ ప్రకాష్ చౌహన్, సర్పంచ్, ఎంపీటీసీ ఉన్నారు. -
పండ్లతోటల రైతులతో ట్రైనీ కలెక్టర్ ముఖాముఖి
– మన్నీల, బత్తలపల్లి, రెడ్డిపల్లిలో తోటల పరిశీలన అనంతపురం అగ్రికల్చర్ : పండ్లతోటల రైతుల స్థితిగతులపై ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ అధికారులతో కలిసి మంగళవారం రూరల్ మండలం మన్నీల, బత్తలపల్లి, బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలో పర్యటించారు. దానిమ్మ, అరటి, ద్రాక్ష తోటలను సందర్శించి వాటి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. పంట పెట్టుబడులు, దిగుబడులు, మార్కెటింగ్, ఇతరత్రా సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాలు, రాయితీలను తెలుసుకున్నారు. పంటల యాజమాన్యం, పురుగులు, తెగుళ్ల గురించి ఆరా తీశారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. అయితే అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసులు, సీజన్ల వారీగా మార్కెటింగ్ ఆధారంగా ముందుకు పోవాలన్నారు. తద్వారా ఆర్థికాదాయం సాధించవచ్చన్నారు. దీని వల్ల ప్రభుత్వం లక్ష్యం రెండంకెల వృద్ధి రేటు కూడా సాధ్యమవుతుందన్నారు. రేకులకుంట వ్యవసాయ, ఉద్యాన పరిశోధనా స్థానాల్లో జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలు, ప్రయోగాత్మక కార్యక్రమాలపై తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీలు సత్యనారాయణ, బీవీ రమణ, టెక్నికల్ హెచ్‌వో జి.చంద్రశేఖర్, శాస్త్రవేత్తలు రవీంద్రారెడ్డి, సహదేవరెడ్డి, రాధిక, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
క్లీన్ సిటీని పరిశీలించిన ట్రెయినీ కలెక్టర్
కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వరంగల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న క్లీన్ సిటీ కార్యక్రమాన్ని ట్రెయినీ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ, రవాణా విధానంతో పాటు హన్మకొండలోని బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్రాజెక్టు, సేంద్రియ ఎరువు తయారీ విధానం, డ్రై రిసోర్స సెంటర్‌ను సందర్శించారు. ఇందులో భాగంగా వ్యర్థాలతో బయోగ్యాస్ విద్యుత్, సేంద్రియ ఎరువు తయారీ వివరాలను ఎంహెచ్ఓ ధన్‌రాజ్.. ట్రెయినీ కలెక్టర్‌కు వివరించారు. ఆ తర్వాత మడికొండలోని కాకతీయ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు(డంపింగ్ యార్డు)ను కూడా పరిశీలించిన ఆయన శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల విధులను అడిగి తెలుసుకున్నారు.