traing
-
రూరల్ స్టూడెంట్స్.. సీఎస్సీ.. ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’
న్యూఢిల్లీ: సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా, ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహకార ఒప్పందానికి వచ్చాయి. 10–22 ఏళ్ల వయసు విద్యార్థులకు ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు వొకేషషణల్ శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పరిధిలోని సంస్థే సీఎస్సీ ఈ గవర్నెన్స్. ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ పథకం కింద 6 కోట్ల గ్రామీణులకు డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమని సీఎస్సీ ఈ గవర్నెన్స్ ఇండియా ఎండీ దినేష్ కే త్యాగి తెలిపారు. -
‘అమూల్’ శిక్షణా తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడిపరిశ్రమకు జవసత్వాలు కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో ఎంవోయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ రాష్ట్రంలో తన కార్యక్రమాలను ప్రారంభించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో 7వేల పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలను ఏర్పాటు చేయడానికి సహకార శాఖలోని డెప్యూటి రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులను ఎంపిక చేసింది. వీరికి పాల ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు అమూల్ చర్యలు తీసుకుంటోంది. (ఇటు పాల వెల్లువ.. అటు మహిళా సాధికారత) ఎంపికైన అధికారులను రెండు, మూడు బృందాలుగా గుజరాత్‌లోని అమూల్ కేంద్రానికి శిక్షణకు పంపనుంది. పది నుంచి ఇరవై రోజులపాటు వీరంతా అక్కడ శిక్షణ పొందనున్నారు. అక్కడ శిక్షణ పొందిన అధికారులు ఒక్కో జిల్లాకు 15 పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తారు. వీరంతా తమ పరిధిలోని మిగిలిన సభ్యులకు శిక్షణ ఇస్తారు. రెండు, మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన 7వేల పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ పూర్తి చేస్తారు. తొలుత శిక్షణ పొందిన 15 మహిళా సంఘాలకు ముఖాముఖి, మిగిలిన సభ్యులకు గుజరాత్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ నుంచి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత అమూల్‌కు చెందిన ఉన్నతస్థాయి బృందం రాష్ట్రంలో పర్యటించి సహకార డెయిరీలు, ఉద్యోగులు, యాంత్రిక పరికరాలను పరిశీలిస్తుంది. రాష్ట్రంలోని పాడిపరిశ్రమ స్థితిగతులు, పశు సంపద, ప్రైవేట్ డెయిరీల కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంది. భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలపై వ్యూహరచనకు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించనుందని ఏపీ డీడీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వాణీమోహన్ తెలిపారు. -
కౌంటింగ్‌పై శిక్షణ.. మూడంచెల భద్రత
సాక్షి, విజయవాడ : ఈవీఎం, వీవీప్యాట్లు, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, 13 జిల్లాల కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు హాజరయ్యారు. ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ ఓట్ల లెక్కింపు విధానంపై అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్స్ ఏర్పాట్లు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టే వీడియో కవరేజ్ అంశాలపై ఈసీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థుల వారిగా వీవీప్యాట్ స్లిప్పులను సాగ్రిగేట్చేసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. అభ్యర్థుల వారిగా 25 వీవీప్యాట్ స్లిప్పులను ఒక బండిల్‌గా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆర్వోలు పూర్తిగా నిర్థారణ చేసుకున్న తర్వాతే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలన్నారు. -
టైలరింగ్ శిక్షణ ప్రారంభం
ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ శనివారం ప్రారంభించారు. ౖయెటింక్లయిన్‌కాలనీ సేవాభవనంలో జరిగిన కార్యక్రమంలో ఆర్జీ–2 సేవా అధ్యక్షురాలు శకుంతలవిజయపాల్రెడ్డి టైలరింగ్ శిక్షణ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం ఉపాధి కోర్సుల్లో మహిళలు ముందంజలో ఉండాలని కోరారు. సింగరేణి సంస్థ ఉచితంగా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సేవా కార్యదర్శి సుజన, డీజీఎం పర్సనల్ ఎన్వీ.రావు, డీవైపీఎం రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
రవాణాశాఖ ఆన్లైన్ సేవలపై శిక్షణ
తిమ్మాపూర్ : రవాణాశాఖకు సంబంధించిన ఆన్లైన్ సేవలపై మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్ డీటీసీ వినోద్‌కుమార్ తెలిపారు. రోజుకు మూడు బ్యాచ్‌ల చొప్పున జిల్లాలోని నిర్వాహకులకు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆన్లైన్ సేవలకు దరఖాస్తు చేసుకునే వి«ధానం నేర్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. -
జ్యోతిష్మతిలో ముగిసిన శిక్షణ శిబిరం
తిమ్మాపూర్ : మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ విద్యార్థులకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహించిన ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. టాస్క్ సీనియర్ ట్రైనర్లు బెన్నీ జార్జ్, రాజరాజేశ్వరి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇందులో లక్ష్యాలను నిర్ధారించుకోవడం, సృజనాత్మకత, వాక్చాతుర్యం, రచనల్లో నైపుణ్యాలు పెంపొందించడం, సమయపాలన, మర్యాదక్రమాలు, నీతి విలువలు, వాణిజ్య సంబంధ ఆంగ్లంలో నిపుణత సాధించడం వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు సూచించారు. ప్రిన్సిపాల్ విజేంద్రకుమార్, లెక్చరర్లు వైశాలి, గోపాల్‌రెడ్డి, విశ్వప్రకాష్బాబు తదితరులు పాల్గొన్నారు.