కొత్త అనుమానాలు.. అదానీ ట్రైన్ టిక్కెట్ల బిజినెస్‌పై ఐఆర్సీటీసీ ఏమందంటే?
ఆన్లైన్ ట్రైన్ బుకింగ్ సంస్థ ట్రైన్‌మ్యాన్ (స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రై.లిమిటెడ్)ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అదానీ డిజిటల్ ల్యాబ్స్ ఈ స్టార్టప్‌ను దక్కించున్న విషయం తెలిసిందే.
అయితే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న ట్రైన్ మ్యాన్ పోటీగా రానుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌లపై ఐఆర్సీటీసీ స్పందించింది.
यह भ्रामक कथन है। Trainman IRCTC के 32 अधिकृत बी2सी (बिजनेस टू कस्टमर) भागीदारों में से एक है। हिस्सेदारी बदलने से इसमे कोई अंतर नहीं आयेगा। सभी एकीकरण और संचालन IRCTC के माध्यम से किए जाते रहेंगे। यह केवल IRCTC का पूरक होगा और IRCTC के लिए कोई खतरा या चुनौती नहीं है। https://t.co/7ERSbMj6JR
— IRCTC (@IRCTCofficial) June 18, 2023
ఐఆర్సీటీసీ గుర్తింపు పొందిన బిజినెస్ టూ కస్టమర్ సర్వీసులు (బీ2సీ) అందించే 32 సంస్థల్లో ట్రైన్ మ్యాన్ ఒకటి. 0.13 శాతం మాత్రమే ప్రయాణికులకు ట్రైన్ టికెట్ల రిజర్వేషన్‌తో పాటు ఇతర సర్వీసులు అందిస్తుంది. కానీ, ఇండియన్ రైల్వేస్‌లో రోజుకు 14.5లక్షల రిజర్వేషన్ టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. వాటిలో 81శాతం ఇ-టికెట్లు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేస్తున్నట్లు ట్వీట్ చేసింది.
Will Adani compete with IRCTC?
No.
IRCTC is a 100% monopoly in railway ticketing. Whether you book tickets from IRCTC or from aggregators like Paytm, MakeMyTrip or now Adani acquired Trainman, IRCTC makes money.
It earned Rs 70 crore via Paytm in FY 2022, @ Rs 12 per ticket.
1/ pic.twitter.com/pwOOzxQ6Ud
— ICICIdirect (@ICICI_Direct) June 19, 2023
ప్రస్తుతం, ఐఆర్సీటీసీకి ట్రైన్ మ్యాన్ పోటీ అంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. అదానీ గ్రూప్.. ట్రైన్ మ్యాన్‌ను కొనుగోలు చేయడం వల్ల కార్యకలాపాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఐఆర్సీటీసీ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయి. ఐఆర్సీటీసీకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.
కాగా, అదానీ గ్రూప్ మొదట ఐఆర్సీటీసీతో పోటీ పడుతుందని, తరువాత స్వాధీనం చేసుకుంటుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన ఆరోపణల్ని సైతం ఐఆర్సీటీసీ కొట్టిపారేసింది.
చదవండి👉 స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్’!