trainning
-
ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాక్ సైన్యం
ముజఫరాబాద్ (పీవోకే) : పాకిస్తాన్ సైన్యమే ఉగ్రవాదులకు సైనిక శిక్షణ ఇచ్చి కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్లకు పంపుతోందని పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని ప్రముఖ సామాజిక కార్యకర్త తౌఖీర్ గిలానీ ఆదివారంసంచలన ప్రకటన చేశారు. దాదాపు 15 ఏళ్లుగా పాకిస్తాన్ తన భూభాగంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా సుమారు 500 మంది ఉగ్రవాదులకు సైనిక శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్ సైన్యం.. వారిని సురక్షిత ప్రదేశాల్లో దాచిందని ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్‌లలో జీహాదీ ఉగ్రవాదులుగా విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ లోయలోని అమాయక గిరిజన ముస్లిం యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించి వారికి సైనిక శిక్షణ పాకిస్తానే ఇస్తోందని ఆయన తెలిపారు. శిక్షణ పొందుతున్న యువతని కూడా అత్యంత దారుణంగా హింసిస్తారని తౌఖీర్ గిలానీ అన్నారు. ప్రధానంగా శిక్షణ పొందుతున్న కశ్మీర్ యువతను ఎవరైనా స్థానికులు పొరపాటును చూడడం జరిగితే.. వాళ్లను కల్చి చంపాలనే కఠిన ఆదేశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. నీలం లోయని ఉగ్రవాదుల అడ్డాగా పాకిస్తాన్ మార్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
వ్యాపారాభివృద్ధికి శిక్షణ దోహదం
నరసాపురం రూరల్: మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా లేసు అల్లికల మహిళలను తీర్చిదిద్దేందుకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని హస్తకళల అభివద్ధి అధికారి లంక మనోజ్ అన్నారు. మండలంలోని రుస్తుంబాద గ్రామంలోని ఇంటర్నేషనల్ లేసు ట్రేడ్ సెంటర్లో ‘వ్యాపారవేత్తలుగా ఎదగడం ఎలా’ అంశంపై శిక్షణను మంగళవారం ఆయన ప్రారంభించారు. న్యూఢిల్లీకి చెందిన ఈపీసీహెచ్, కేంద్ర హస్తకళల అభివద్ధి కమిషన్ సహకారంతో ఈనెల 20వ తేదీ వరకు శిక్షణ నిర్వహిస్తామని ఐఎల్‌టీసీ ప్రోగ్రాం ఆఫీసర్ రాహుల్ రంజన్ తెలిపారు. ప్రస్తుతం రెండు బ్యాచ్‌లకు శిక్షణ ప్రారంబించామన్నారు. మొత్తం 14 బ్యాచ్‌ల ద్వారా 280 మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. నరసాపురం ప్రాంత లేసు అల్లికలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో ఆధునిక అవసరాలకు అనుగుణంగా అల్లికలను రూపుదిద్దేందుకు శిక్షణలు దోహదపడతాయన్నారు. పూర్తిస్థాయి శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం హస్త కళల అభివద్ధికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని అల్లికా మహిళలు గుర్తించి శిక్షణ పారదర్శకంగా పొందాలని వారు సూచించారు. ఐఎల్‌టీసీ కన్వీనర్ కలవకొలను తులసీరావు, శిక్షకుడు, వైఎన్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఎం.సత్యనారాయణ (ఎంఎస్ఎన్), ఏసురాముడు, దివాకర్, రాహుల్ పాల్గొన్నారు. -
ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుల ఆహ్వానం
మహారాణిపేట : నిరుద్యోగులైన ఎస్సీ యువతకు ఏటా ఎస్సీ కార్పోరేషన్ అందించే శిక్షణ కార్యక్రమానికి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ (ఎస్సీ కార్పోరేషన్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహాలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2016–17 సంవత్సరానికి గాను వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఔత్సాహికులైన ఎస్సీ యువకులు ఆగష్టు 5 లోగా ఆన్లైన్లో ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. అందుబాటులోని కోర్సులు, అర్హతలు.. – కాంట్రాక్టర్ ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ కోర్స్, దీనికి 18–35 ఏళ్లు వయస్సు, సివిల్ ఇంజనీరింగ్‌లో (డిగ్రీ/డిప్లమో) పూర్తి చేసిన వారు అర్హులన్నారు. వీరికి హైదరాబాద్ ఎన్ఏసీ లో శిక్షణ ఉంటుందన్నారు. కోర్సు కాలపరిమితి 90 రోజులు ఉంటుందన్నారు. – డిప్లమో ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ కోర్స్, దీనికి 18–30 ఏళ్లు వయస్సు, ఇంటర్మీడియట్/డిగ్రీ (పాస్/ఫెయిల్) వారు అర్హులన్నారు. ఈ కోర్సుకు 12 నెలలు శిక్షణ ఉంటుందని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గచ్చిభౌలి లో శిక్షణ ఉంటుందని చెప్పారు. వీటితో పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, వెల్డింగ్, ప్లంబింగ్, శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, మేషినరీ, బార్బెండింగ్ల్లో మూడు నెలలు పాటు శిక్షణ ఉంటుందని పేర్కోన్నారు. మరిన్ని వివరాలకు, 0891–2549860, 9849905959 నెంబర్లలో సంప్రదించాలని మహాలక్ష్మి తెలిపారు.