ముజఫరాబాద్ (పీవోకే) : పాకిస్తాన్ సైన్యమే ఉగ్రవాదులకు సైనిక శిక్షణ ఇచ్చి కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్‌లకు పంపుతోందని పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని ప్రముఖ సామాజిక కార్యకర్త తౌఖీర్ గిలానీ ఆదివారంసంచలన ప్రకటన చేశారు. దాదాపు 15 ఏళ్లుగా పాకిస్తాన్ తన భూభాగంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా సుమారు 500 మంది ఉగ్రవాదులకు సైనిక శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్ సైన్యం.. వారిని సురక్షిత ప్రదేశాల్లో దాచిందని ఆయన తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్‌లలో జీహాదీ ఉగ్రవాదులుగా విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ లోయలోని అమాయక గిరిజన ముస్లిం యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించి వారికి సైనిక శిక్షణ పాకిస్తానే ఇస్తోందని ఆయన తెలిపారు. శిక్షణ పొందుతున్న యువతని కూడా అత్యంత దారుణంగా హింసిస్తారని తౌఖీర్ గిలానీ అన్నారు. ప్రధానంగా శిక్షణ పొందుతున్న కశ్మీర్ యువతను ఎవరైనా స్థానికులు పొరపాటును చూడడం జరిగితే.. వాళ్లను కల్చి చంపాలనే కఠిన ఆదేశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. నీలం లోయని ఉగ్రవాదుల అడ్డాగా పాకిస్తాన్ మార్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment