ఎస్సీ కార్పొరేషన్ శిక్షణ తరగతులకు
Published Wed, Jul 27 2016 12:15 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
మహారాణిపేట : నిరుద్యోగులైన ఎస్సీ యువతకు ఏటా ఎస్సీ కార్పోరేషన్ అందించే శిక్షణ కార్యక్రమానికి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ (ఎస్సీ కార్పోరేషన్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహాలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2016–17 సంవత్సరానికి గాను వివిధ ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఔత్సాహికులైన ఎస్సీ యువకులు ఆగష్టు 5 లోగా ఆన్‌లైన్లో ధరఖాస్తులు చేసుకోవాలన్నారు.
అందుబాటులోని కోర్సులు, అర్హతలు..
– కాంట్రాక్టర్ ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ కోర్స్, దీనికి 18–35 ఏళ్లు వయస్సు, సివిల్ ఇంజనీరింగ్‌లో (డిగ్రీ/డిప్లమో) పూర్తి చేసిన వారు అర్హులన్నారు. వీరికి హైదరాబాద్ ఎన్‌ఏసీ లో శిక్షణ ఉంటుందన్నారు. కోర్సు కాలపరిమితి 90 రోజులు ఉంటుందన్నారు.
– డిప్లమో ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ కోర్స్, దీనికి 18–30 ఏళ్లు వయస్సు, ఇంటర్మీడియట్/డిగ్రీ (పాస్/ఫెయిల్) వారు అర్హులన్నారు. ఈ కోర్సుకు 12 నెలలు శిక్షణ ఉంటుందని తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ గచ్చిభౌలి లో శిక్షణ ఉంటుందని చెప్పారు. వీటితో పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, వెల్డింగ్, ప్లంబింగ్, శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, మేషినరీ, బార్‌బెండింగ్‌ల్లో మూడు నెలలు పాటు శిక్షణ ఉంటుందని పేర్కోన్నారు. మరిన్ని వివరాలకు, 0891–2549860, 9849905959 నెంబర్లలో సంప్రదించాలని మహాలక్ష్మి తెలిపారు.
Advertisement