పొగమంచు కారణంగా 135 రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో శుక్రవారం పొగమంచు, చలిగాలుల తీవ్రత ఎక్కువ కావటంతో 135 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పలు రవాణా మార్గాలకు పొగమంచు భంగం కలిగిస్తోంది. దీని కారణంగా ఎక్కువగా రైళ్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
ప్రతికూల వాతావరణం వల్ల మూడు రోజులుగా 135 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లతో పాటు వాయు రవాణాకు కూడా పొగమంచు ఇబ్బంది కలిగిస్తోంది. దేశంలో ఏడు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.