tral
-
ట్రాల్లో ఉగ్రవాదుల దాడి..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు లక్ష్యంగా గురువారం ఉదయం దాడులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది పోలీసులు, జవాన్లే ఉన్నారు. సీఆర్పీఎఫ్ యూనిట్ లక్ష్యంగా మొదట గ్రనేడ్ దాడులు చేసిన ఉగ్రవాదులు అనంతరం కాల్పులు జరిపారు. రాష్ట్రమంత్రి నయీమ్ అఖ్తర్ ట్రాల్ ప్రాంతానికి ఓ ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి మంత్రి తృటిలో సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించిన భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని.. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. ర్యాంబన్లో జరిగిన మరో ఉగ్రవాద దాడిలో ఆర్మీ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. -
సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రదాడి
శ్రీనగర్: కల్లోల జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. త్రాల్‌లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై మంగళవారం గ్రెనేడ్లతో దాడి జరిపారు. ఈ ఘనటలో తొమ్మిది మంది జవాన్లు గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి క్యాంప్ మొత్తం తమ ఆధీనంలోనే ఉన్నదని, దాడికి పాల్పడిన ముష్కరుల కోసం వేట కొనసాగుతున్నదని పేర్కొన్నారు.