‘మహా’కుదుపు
చీఫ్ ఇంజనీర్‌గా దుర్గా ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
మరో ముగ్గురు జోనల్ కమిషనర్లకు బదిలీ
కొత్తగా ముగ్గురు జాయింట్ కమిషనర్లు రాక
విశాఖపట్నం సిటీ: జీవీఎంసీలో ఉన్నపలాన జరిగిన ఉన్నతాధికారుల బదిలీ ఓ కుదుపు కుదిపింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అధికారులను ఒకేసారిగా కదిలించడం విస్మయపరిచింది. ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలియడంతో మహా విశాఖ కార్యాలయంలో ‘బదిలీ‘ జ్వరం సోకింది. పురపాలక శాఖా మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన నుంచి 15వ తేదీన రాగానే మరింతమంది అధికారుల సీట్లు కదులుతాయనే ప్రచారం ఊపందుకుంది. చాలాకాలంగా సీట్లకు అంటిపెట్టుకున్న మహామహులకే బదిలీ కావడంతో వారిని నమ్ముకున్నవారికి ఏంచేయాలో ఇప్పుడు పాలుపోవడంలేదు. ఈ నెల 15, 16 తేదీల్లో మరికొందరికి బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రచారం జరుగుతోంది.
మాతృ సంస్థలకు జోనల్ కమిషనర్లు..
{Vేటర్ పరిధిలోని కొందరు జోనల్ కమిషనర్లు మాతృ శాఖలకు వెళ్లిపోనున్నారు. ఇప్పటికే ఉత్తర్వులు సిద్ధంగా వున్నట్టు తెలిసింది. వీరి స్థానాలను మున్సిపాల్టీలకు చెందిన వారితో భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీనివల్ల ఆరుగురు జోన్లకు నలుగురు కొత్తవారొచ్చే అవకాశముంది.
రెండో జోన్‌కు జోనల్ కమిషనర్ పోస్టు ఖాళీగా వుంది. అదనపు కమిషనర్ జీవీవీఎస్ మూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మూడో జోన్‌కు మున్సిపల్ స్కూల్ డ్రిల్ మాస్టర్ డాక్టర్ వై. శ్రీనివాస్‌రావు జోనల్ కమిషనర్‌గా వున్నారు. తాజా మార్పుల్లో ఆయన మళ్లీ పాఠశాల విభాగానికి వెళ్లిపోనున్నారు.
అయిదో జోన్‌కు పర్యాటక శాఖకు చెందిన ఎ. శ్రీనివాస్ జోనల్కమిషనర్గా వున్నారు. ఈయన మాతృశాఖకు మారిపోవచ్చని అంటున్నారు.ఆరో జోన్‌కు సహకార రంగానికి చెందిన బి. సన్యాసినాయుడు జోనల్ కమిషనర్‌గా వున్నారు. ఈయన త్వరలో మాతృశాఖకు బదిలీ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఖాళీగా వున్న మూడు జాయింట్ కమిషనర్ పోస్టులు, ఓ కార్యదర్శి పోస్టు కూడా జరగనుంది.
చీఫ్ ఇంజనీర్‌గా దుర్గాప్రసాద్..!
ముఖ్య ఇంజనీర్‌గా ఎన్. దుర్గాప్రసాద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ప్రజారోగ్య శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈయన గతంలో అదే శాఖలో కార్యనిర్వాహక ఇంజనీర్‌గా విశాఖలోనే సేవలందించారు. ఇప్పటి వరకూ జీవీఎంసీ ముఖ్య ఇంజనీర్‌గా పని చేసిన బి. జయరామిరెడ్డికి బదిలీ అయ్యింది. ఏడున్నరేళ్లుగా ఇదే పోస్టులో వున్న ఈయన్ను ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అలాగే తాగు నీటి విభాగ సూపరింటెండెంగ్ ఇంజనీర్ డి. మరియన్నకు గుంటూరు నగర పాలక సంస్థకు బదిలీ చేశారు. ఈయన స్థానంలో విజయవాడ మున్సిపల్ కార్పొరే షన్ నుంచి ఎస్ఈగా వున్న టి. మోజెస్‌ను నియమించింది. మోజెస్ కుమార్ గతంలో ఇక్కడే పని చేశారు.