Transfer Order
-
‘అమిత్ షా పీఏని.. ట్రాన్సఫర్ క్యాన్సల్ చేయ్’
భోపాల్: ‘నేను అమిత్ షా పీఏని మాట్లాడుతున్నాను.. నా స్నేహితుడి ట్రాన్సఫర్ ఆర్డర్‌ను క్యాన్సల్ చేయండి’ అంటూ ఓ వ్యక్తి ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వ్యక్తిగత సిబ్బందికి కాల్ చేశాడు. అనుమానం వచ్చి వారు అమిత్ షా కార్యాలయానికి సమాచారమిచ్చారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు అభిషేక్ ద్వివేదిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వివరాలు.. మధ్యప్రదేశ్ రేనాకు చెందిన అభిషేక్ ద్వివేది స్నేహితుడొకరిని గ్వాలియర్‌లోని పరివాహన్ ఆయుక్త్ కార్యాలయానికి ట్రాన్సఫర్ చేశారు. అయితే అతడు వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ కావాలని భావించాడు. దాంతో అభిషేక్ సాయం కోరాడు. (‘ఆ నిర్ణయంతో 2.8 లక్షల ఉద్యోగాలు’) ఈ క్రమంలో ఈ నెల 3న నిందితుడు నితిన్ గడ్కరి వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ చేసి తాను అమిత్ షా పర్సనల్ సెక్రటరీనని పరిచయం చేసుకున్నాడు. అనంతరం తన స్నేహితుడి ట్రాన్సఫర్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరాడు. అనుమానం వచ్చిన సిబ్బంది.. దీని గురించి అమిత్ షా సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు ఈ ఫోన్ కాల్ గురించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడిని రేనాకు చెందిన అభిషేక్‌గా గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు ముంబై పారిపోయాడు. (నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ని...) పోలీసులు అతడి కోసం నవీ ముంబైలోని కోలాంబేలి, ఖార్గర్, బేలాపూర్, తలోజా ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అతన్ని ఇండోర్‌లో పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అభిషేక్ దగ్గర నుంచి అతడు కాల్ చేయడానికి ఉపయోగించిన ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో అభిషేక్ తన బాల్య స్నేహితుడు వినయ్ సింగ్ బాగెల్, పరివాహన్ నిరిక్షక్ ట్రాన్సఫర్ ఆర్డర్‌ను రద్దు చేయమని కోరినట్లు చెప్పడంతో ఇలా చేశానని తెలిపాడు. -
పోలీస్‌లకు స్థానచలనం!
సాక్షి, కరీంనగర్ : పోలీసు బదిలీలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో మునిసిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఐ స్థాయి అధికారులను మినహా ఒకే స్టేషన్లో మూడు నుంచి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరికీ స్థానభ్రంశం కల్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని వివిధ జిల్లాల్లో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైల బదిలీల ప్రక్రియను బల్దియా ఎన్నికలతో సంబంధం లేకుండా పూర్తి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి నిర్ణయించారు. పాత కరీంనగర్ యూనిట్‌గా జరిగే ఈ బదిలీలు, పోస్టింగ్‌ల బాధ్యత డీఐజీ హోదాలో కమలాసన్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. దీంతో పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌తోపాటు సిద్దిపేట, వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని తొమ్మిది పోలీస్స్టేషన్లకు చెందిన పోలీసుల బదిలీలు కరీంనగర్ కమిషనర్ నేతృత్వంలోనే జరుగనున్నాయి. ఆయా జిల్లాల ఎస్పీల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా రెండు మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కమలాసన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 16వ తేదీ వరకు బదిలీ దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది మే 31 వరకు ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లుగా పనిచేసిన కానిస్టేబుళ్లు, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుళ్లతోపాటు మూడేళ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సైలను బదిలీ చేయాలని కమిషనర్ కమలాసన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అంతర్గత బదిలీలకు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏవైనా ఐదు పోలీస్స్టేషన్లను ఆప్షన్లుగా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోలీస్ సబ్ డివిజన్, సొంత మండలం కాకుండా బదిలీలకు ఆప్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు ఆయా జిల్లాల ఎస్పీలకు దరఖాస్తులు చేసుకున్నారు. చాలాకాలంగా ఈ స్థాయి పోలీసుల బదిలీలు జరగకపోవడంతో సుమారు 500 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎస్పీలు దరఖాస్తులను పరిశీలించి కరీంనగర్ కమిషనరేట్‌కు బదిలీలకు అర్హులైన వారి వివరాలు, వారు కోరుకుంటున్న పోలీస్స్టేషన్ల డేటాను పంపించారు. అయితే ఒకటి రెండు జిల్లాల నుంచి ఇంకా ప్రతిపాదనలు రాకపోవడంతో కమిషనర్ ప్రక్రియను ప్రారంభించలేదని తెలిసింది. శుక్రవారంలోగా అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పలు అంశాల పరిశీలన చాలా కాలం నుంచి జిల్లాల సరిహద్దులు, అటవీ ప్రాంతాలు, సరైన ప్రాధాన్యత లేని మండలాల్లో పనిచేస్తున్న పోలీసులు ఈసారి బదిలీల్లో కరీంనగర్‌తోపాటు కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్స్ సమీపంలోకి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారు ఎక్కువగా కరీంనగర్‌ను ఆప్షన్‌గా ఇచ్చినట్లు సమాచారం. బదిలీల విషయంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా నుంచి వివిధ స్థాయిల్లో 50 మంది బదిలీ జరిగే అవకాశం ఉంటే, ఇతర జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా 50 మందికే అవకాశం లభిస్తుంది. అలాగే ఇతర సర్వీసుల్లో ఉన్నవారి బదిలీల తరహాలోనే పదవీ విరమణకు గల గడువు, భాగస్వామి పనిచేస్తున్న ప్రాంతాలు, మెడికల్ గ్రౌండ్స్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పోలీస్‌స్టేషన్ రైటర్లు, క్రైం టీంలు, ఇతర పరిపాలన విభాగాల్లో పనిచేస్తున్న వారి బదిలీల విషయంలో స్థానికంగా ఉన్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల బదిలీలపై పోలీస్‌వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐ, సీఐల బదిలీల విషయంలో ఆచితూచి కమిషనరేట్ పరిధిలోని ఎస్ఐల అంతర్గత బదిలీల విషయంలో కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బుధవారం బదిలీ చేసిన 13 మంది ఎస్ఐలలో ముగ్గురు మినహా మిగతా వారంతా వివిధ కారణాల వల్ల అటాచ్డ్ అయిన వారే. వారికి ఖాళీలుగా ఉన్న చోట పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ రేంజ్ పరిధిలో జరిగే ఎస్ఐల బదిలీలను డీఐజీ ప్రమోద్‌కుమార్ నేతృత్వంలో జరుగుతాయి. రేంజ్ పరిధిలో బదిలీలకు సంబంధించి డీఐజీ ప్రమోద్‌కుమార్ తీసుకునే నిర్ణయంపై స్పష్టత లేదు. మునిసిపల్ ఎన్నికలకు గడువు పెరిగితే ఎస్ఐల బదిలీలు కరీంనగర్ రేంజ్ పరిధిలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక సీఐల బదిలీలకు సంబంధించి ఐజీ నాగిరెడ్డి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వరంగల్, కరీంనగర్ రేంజ్ పరిధిలలో ఈ బదిలీల ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అయితే మునిసిపల్ ఎన్నికలు ముగిసే వరకు సీఐ, డీఎస్పీల స్థాయిలో బదిలీలు ఉండకపోవచ్చని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. -
ట్వీట్ ఎఫెక్ట్ : ట్రాన్స్ఫర్, షోకాజ్ నోటీసులు
ముంబై : మహాత్మా గాంధీపై ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కి జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న నిధి చౌదరిని నీటి సరఫరా, పారిశుద్య శాఖ డిప్యూటి సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇవ్వాల్సిందగా ఆదేశించడమే కాక షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ పదిహేను రోజుల కిందట ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ‘మన కరెన్సీపై గాంధీ ముఖాన్ని తొలగించడం, ప్రపంచవ్యాప్తంగా ఆయన విగ్రహాలను రూపుమాపడం, ఆయన పేరిట నెలకొల్పిన సంస్ధలు, రహదారుల పేర్లు మార్చడం ఇప్పుడు తక్షణం మనం చేయాల్సిన పని.. ఇదే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి.. థ్యాంక్యూ గాడ్సే’ అంటూ ఆమె చేసిన ట్వీట్ కలకలం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో ట్వీట్‌ను ఆమె తొలగించారు. నిధి చౌదరిని ప్రభుత్వ సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘ఆ ట్వీట్‌పై రాద్ధాంతం అవసరమా’) -
వీరరాఘవుని మూడేళ్ల ప్రస్థానానికి ముగింపు
తిరువళ్లూరు : తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్ల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించిన కలెక్టర్ వీరరాఘవరావుకు బదిలీ ఉత్తర్వులతో ముగింపు పలికింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన వీరరాఘవరావు, 2012 నవంబర్‌లో జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 36 నెలల పాటు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన వీరరాఘవరావును మదురైకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌గా సుందరవళ్లిన నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూడేళ్ల పాటు తిరువళ్లూరు జిల్లాతో కలెక్టర్ వీరరాఘవరావుకు ఉన్న అనుబంధానికి బదిలీతో తెరపడింది. ఆలయమంటే ఇష్టం : తిరువళ్లూరులోని శ్రీవైద్య వీరరాఘవుని ఆలయాన్ని కలెక్టర్ వీరరాఘవరావు కుటుంబ సభ్యులు అప్పట్లోనే తరచూ వీరరాఘవుని ఆలయాన్ని సంద ర్శించుకునే వారని సమాచారం. అందుకే తనకుఆపేరు పేరు పెట్టినట్టు గతంలో స్వయంగా కలెక్టర్ వివరించారు. వీరరాఘవుని సన్నిధిలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావించి ఆల యం అభివద్ధి కోసం ప్రత్యేక చొరవ తీ సుకుని పుష్కరిణీ మరమ్మత్తులు తదితర వాటి కోసం నిధులు కేటాయించారు. మొదట్లో వేగం.. కలెక్టర్‌గా వీరరాఘవరావు 2012వ సం వత్సరంలో బాధ్యతలు స్వీకరించిన త రువాత అధికారులను హడలెత్తించా రు. తనిఖీలతో అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఎన్నడూ లేని విధం గా కలెక్టర్ వద్దకు తమ సమస్యల పరి ష్కారం కోసం ప్రజలు బారులు తీరేవా రు. అయితే రానురాను కలెక్టర్‌తో సమస్యను విన్నవించుకున్నా ఫలితం లేకుం డా పోయిందని ఆవేదన వ్యక్తం చేసే వారు పరిష్కారం కాని తెలుగు విద్యార్థుల సమస్యలు : తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌గా వీరరాఘవరావు మూడేళ్లు ఉన్నా తెలుగు విద్యార్థుల సమస్యలు తీరలేదని తెలుగు సం ఘం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. తప్పని ఆరోపణలు : కలెక్టర్‌గా వీరరాఘవరావు బాధ్యతలు స్వీకరించిన తరువాత చురుగ్గా వ్యవహరించినా ఆరోపణలు తప్పలేదు. కేవలం అధికార పార్టీకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. వరదల సమయంలో ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకోవాల్సిన కలెక్టర్, మంత్రుల వెంట వెళ్లడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. దీంతో పాటు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైనట్టు కొందరు కేసు వేయడంతో హైకోర్టు గడపనెక్కారు. మీటింగ్‌ల పేరిట ఉద్యోగులను రాత్రి 12 గంటల వరకు వేచి వుండేలా చేసి ఆందోళనలు చేసే పరిస్థితికి తెచ్చిపెట్టారు. మొత్తానికి కలెక్టర్ చురుగ్గా వ్యవహరించినా విమర్శలు మాత్రం తప్పలేదు. భాషాభిమానం లేదు : వీరరాఘవరావు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లాలోని తెలుగు ప్రజలు సంబరపడ్డారు. అయితే కలెక్టర్‌లో మాత్రం భాషాభిమానం లేదని చెన్నైకు చెందిన తెలుగు సంఘం కార్యదర్శి వాపోయారు. 2013వ సంవత్సరం చెన్నైలో తెలుగు ప్రజల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందుకు కలెక్టర్‌ను ఆహ్వానించాం. అయితే ఆహ్వాన పత్రికను తీసుకుని తనకు భాషాభిమానం లేదు. నేను కార్యక్రమానికి రాలేనని చెప్పారని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇదే విధంగా చెన్నైకు వరదల సమయంలో అనంతపురం నుంచి కొందరు సహాయకాలను తీసుకొచ్చి అప్పగించే సమయంలో మీరు తెలుగువారే కదా కొందరు ప్రశ్నిస్తే కలెక్టర్ తమిళంలో సమాధానమిచ్చి నిరుత్సాహానికి గురి చేసిన సందర్భాలున్నాయి.