వీరరాఘవుని మూడేళ్ల ప్రస్థానానికి ముగింపు
తిరువళ్లూరు : తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్ల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించిన కలెక్టర్ వీరరాఘవరావుకు బదిలీ ఉత్తర్వులతో ముగింపు పలికింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన వీరరాఘవరావు, 2012 నవంబర్‌లో జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 36 నెలల పాటు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన వీరరాఘవరావును మదురైకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌గా సుందరవళ్లిన నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూడేళ్ల పాటు తిరువళ్లూరు జిల్లాతో కలెక్టర్ వీరరాఘవరావుకు ఉన్న అనుబంధానికి బదిలీతో తెరపడింది.
ఆలయమంటే ఇష్టం :
తిరువళ్లూరులోని శ్రీవైద్య వీరరాఘవుని ఆలయాన్ని కలెక్టర్ వీరరాఘవరావు కుటుంబ సభ్యులు అప్పట్లోనే తరచూ వీరరాఘవుని ఆలయాన్ని సంద ర్శించుకునే వారని సమాచారం. అందుకే తనకుఆపేరు పేరు పెట్టినట్టు గతంలో స్వయంగా కలెక్టర్ వివరించారు. వీరరాఘవుని సన్నిధిలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావించి ఆల యం అభివద్ధి కోసం ప్రత్యేక చొరవ తీ సుకుని పుష్కరిణీ మరమ్మత్తులు తదితర వాటి కోసం నిధులు కేటాయించారు.
మొదట్లో వేగం..
కలెక్టర్‌గా వీరరాఘవరావు 2012వ సం వత్సరంలో బాధ్యతలు స్వీకరించిన త రువాత అధికారులను హడలెత్తించా రు. తనిఖీలతో అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఎన్నడూ లేని విధం గా కలెక్టర్ వద్దకు తమ సమస్యల పరి ష్కారం కోసం ప్రజలు బారులు తీరేవా రు. అయితే రానురాను కలెక్టర్‌తో సమస్యను విన్నవించుకున్నా ఫలితం లేకుం డా పోయిందని ఆవేదన వ్యక్తం చేసే వారు
పరిష్కారం కాని
తెలుగు విద్యార్థుల సమస్యలు : తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌గా వీరరాఘవరావు మూడేళ్లు ఉన్నా తెలుగు విద్యార్థుల సమస్యలు తీరలేదని తెలుగు సం ఘం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
తప్పని ఆరోపణలు :
కలెక్టర్‌గా వీరరాఘవరావు బాధ్యతలు స్వీకరించిన తరువాత చురుగ్గా వ్యవహరించినా ఆరోపణలు తప్పలేదు. కేవలం అధికార పార్టీకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. వరదల సమయంలో ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకోవాల్సిన కలెక్టర్, మంత్రుల వెంట వెళ్లడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. దీంతో పాటు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైనట్టు కొందరు కేసు వేయడంతో హైకోర్టు గడపనెక్కారు. మీటింగ్‌ల పేరిట ఉద్యోగులను రాత్రి 12 గంటల వరకు వేచి వుండేలా చేసి ఆందోళనలు చేసే పరిస్థితికి తెచ్చిపెట్టారు. మొత్తానికి కలెక్టర్ చురుగ్గా వ్యవహరించినా విమర్శలు మాత్రం తప్పలేదు.
భాషాభిమానం లేదు :
వీరరాఘవరావు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లాలోని తెలుగు ప్రజలు సంబరపడ్డారు. అయితే కలెక్టర్‌లో మాత్రం భాషాభిమానం లేదని చెన్నైకు చెందిన తెలుగు సంఘం కార్యదర్శి వాపోయారు. 2013వ సంవత్సరం చెన్నైలో తెలుగు ప్రజల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందుకు కలెక్టర్‌ను ఆహ్వానించాం. అయితే ఆహ్వాన పత్రికను తీసుకుని తనకు భాషాభిమానం లేదు. నేను కార్యక్రమానికి రాలేనని చెప్పారని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇదే విధంగా చెన్నైకు వరదల సమయంలో అనంతపురం నుంచి కొందరు సహాయకాలను తీసుకొచ్చి అప్పగించే సమయంలో మీరు తెలుగువారే కదా కొందరు ప్రశ్నిస్తే కలెక్టర్ తమిళంలో సమాధానమిచ్చి నిరుత్సాహానికి గురి చేసిన సందర్భాలున్నాయి.