Transferring issue
-
శరణార్థుల ‘సంరక్షణ నగరాలు’!
వాషింగ్టన్/ఫోనిక్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం అక్రమ వలసదారులకు సానుకూలంగా ఉండేలా కనిపిస్తోంది. వలసదారులను సంరక్షణ నగరాలకు (శాంక్చురీ సిటీస్) పంపే యోచనను ట్రంప్ తీవ్రంగా చేస్తున్నారు. ఈ సంరక్షణ నగరాలకు ప్రజలను పంపడం ద్వారా వారు అమెరికాలోనే ఉండేందుకు అవకాశం కలగనుంది. తమపై నమోదైన వలస కేసులకు సంబంధించి మరింత ఎక్కువగా న్యాయ సహాయం పొందే అవకాశం కూడా అక్రమ వలసదారులకు కలుగుతుంది. షికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో న్యాయ నిపుణులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఈ సంరక్షణ నగరాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉండనుండటం అక్రమ వలసదారులకు ప్రతికూలాంశం. అదే సందర్భంలో ఇతర నగరాల్లోని అక్రమ వలసదారులతో పోలిస్తే సంరక్షణ నగరాల్లో నివసించే అక్రమ వలసదారులు అరెస్టయ్యే అవకాశాలు 20 శాతం తక్కువ. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ న్యాయవాది జార్జ్ గాస్కన్ మాట్లాడుతూ సంరక్షణ నగరాల్లోని అక్రమ వలసదారులు నేరాలకు పాల్పడేందుకు అవకాశం తక్కువనీ, అయితే ఇది రాజకీయ ప్రేరేపణతో తీసుకున్న, ప్రజల జీవితాలతో ఆడుకునే నిర్ణయమని అన్నారు. మెక్సికో సరిహద్దు నుంచి వలసదారులు అమెరికాలోకి ప్రవేశిస్తుండటం ట్రంప్‌ను తీవ్రంగా కలవరపెడుతుండటం తెలిసిందే. అక్రమవలసదారులను సంరక్షణ నగరాలకు తరలించాలన్న ప్రతిపాదన పాతదే. ఇప్పటికే రెండుసార్లు ట్రంప్ యంత్రాంగం దీనిని తిరస్కరించింది. అయితే ట్రంప్ శుక్రవారం ఓ ట్వీట్ చేస్తూ ఈ ప్రతిపాదన ఇంకా తమ పరిశీలనలో ఉందని వెల్లడించడం గమనార్హం. మరోవైపు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మాట్లాడుతూ అక్రమ వలసదారుల విషయంలో తమ ముందు ఉన్న అనేక మార్గాల్లో ఈ సంరక్షణ నగరాలు ఒకటి మాత్రమే పేర్కొన్నారు. ఏమిటీ సంరక్షణ నగరాలు? సంరక్షణ నగరాలకు ప్రత్యేకంగా నిర్వచనమేదీ లేదు. ఒక్కమాటలో స్థూలంగా చెప్పాలంటే కొన్ని అంశాల్లో, ప్రత్యేకించి అక్రమ వలసల విషయాల్లో స్థానిక పోలీసులు అమెరికా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించలేరు. దీనిపై పరిమితులుంటాయి. అక్రమవలసదారులను నిర్బంధించాలని అమెరికా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోరినా దాదాపు 200 పట్టణాలు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. అంటే అవి సంరక్షణ పట్టణాల కిందకు వచ్చినట్లే. న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజిలస్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. -
రమణ దీక్షితుల కుమారులపై బదిలీవేటు
-
'తలుపులు తీసి మరీ గొడవ పడ్డారు'
హైదరాబాద్: విశాఖపట్నం ఆర్డీవోను బదిలీ చేసే విషయంలో టీడీపీ నాయకులు గొడవ పడిన విషయాన్ని అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీఎంవో అధికారుల పట్ల మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరించిన తీరును చంద్రబాబుకు వివరించారు. కార్యాలయం తలుపులు తీసి మరీ గట్టిగా గొడవ పడ్డారని సీఎంవో అధికారులు బాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలు ఆర్డీవోల బదీలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి నిర్ణయం మేరకు జరిగిన ఆర్డీవోల బదిలీలను మంత్రి గంటా అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సచివాలయం ఎల్ బ్లాకులోని సీఎం కార్యాలయ ఉన్నతాధికారి వద్దకు వెళ్లి, తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. బదిలీలను మీరెలా అడ్డుకుంటారని ఆయనను తప్పుపట్టినట్టు సమాచారం. సీఎంవో అధికారుల తీరు బాగోలేదని, మాట్లాడటానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందంటూ విరుచుకుపడ్డారు. సీఎంవో అధికారులు ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లారు. -
మంత్రుల మధ్య ‘బదిలీల’ చిచ్చు
ఆర్డీవోల బదిలీల విషయంలో మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య రచ్చ ‘అవసరాల’ బదిలీల్లో మంత్రుల మధ్య విభేదాలు విశాఖ జిల్లాలో ఇద్దరు ఆర్డీవోల బదిలీ.. వాటిని అడ్డుకున్న గంటా వర్గం కొత్త ఆర్డీవోను విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరించిన కలెక్టర్ కార్యాలయం బదిలీని అడ్డుకున్న సీఎం కార్యాలయ ఉన్నతాధికారిపై అయ్యన్న మండిపాటు ఆ తరువాత సీఎస్‌కు ఫిర్యాదు గంటా భూమి వ్యవహారమే.. అడ్డుకోవడానికి కారణమంట్నున్న పార్టీ వర్గాలు సాక్షి, హైదరాబాద్: అవసరాల మేరకు బదిలీలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మంత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ప్రభుత్వ అవసరాలు కాకుండా మంత్రులు తమ అవసరాలుగా మార్చుకుని బదిలీలకు శ్రీకారం చుట్టారు. దీంతో వారి మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలు ఈ బదీలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీశాయి. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయం మేరకు జరిగిన ఆర్డీవోల బదిలీలను మంత్రి గంటా అడ్డుకున్నారు. ‘చిన్న బాబు’ సూచనల మేరకు సీఎంవో ఉన్నతాధికారి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనుకూలంగా జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్ల్లు సమాచారం. దీంతో ఓ ఆర్డీవోను విధుల్లో చేర్చుకోవడానికి కలెక్టర్ కార్యాలయం అధికారులు నిరాకరించారు. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సీఎం కార్యాలయం అధికారిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. జిల్లాలోని విశాఖపట్నం, అనకాపల్లి ఆర్డీవోల బదిలీలపై జిల్లా టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నిన్నటివరకు అక్కడ పనిచేస్తున్న ఇద్దరు అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో మరో ఇద్దరిని నియమిస్తూ రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి నిర్ణయం తీసుకుని బుధవారం జీవో జారీ చేశారు. వాటిని జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు వ్యతిరేకించారు. ఈ వర్గం నేతలు సీఎం కార్యాలయంపై ఒత్తిడి తీసుకొచ్చి వారి బదిలీలకు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియమితులైన ఒక ఆర్డీవో బాధ్యతలు స్వీకరించడానికి గురువారం జిల్లా కల్టెకర్‌ను కలిశారు.తమకు ఉత్తర్వులు అందలేదంటూ ఆయన్ని విధుల్లోకి తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. దీంతో అయ్యన్నపాత్రుడు ఆగ్రహానికి గురయ్యారు. సీఎంవో అధికారుల ఆదేశాల మేరకే కొత్త ఆర్డీవోను విధుల్లోకి తీసుకోలేదని అయ్యన్నపాత్రుడికి తెలిసింది. దీంతో అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు శుక్రవారం ఉదయమే సచివాలయం ఎల్ బ్లాకులోని సీఎం కార్యాలయ ఉన్నతాధికారి వద్దకు వెళ్లి, తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. బదిలీలను మీరెలా అడ్డుకుంటారని ఆయనను తప్పుపట్టినట్టు సమాచారం. పార్టీలో ఎంతో సీనియర్ అయిన మంత్రి కేఈ తీసుకున్న నిర్ణయాలను కూడా అమలుచేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిపింది. సీఎంవో అధికారుల తీరు బాగోలేదని, మాట్లాడటానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందంటూ విరుచుకుపడ్డారు. అధికారులు పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని, వారి తప్పులను చూస్తూ ఊరుకోనని, తనకు అధికారం కొత్త కాదంటూ మండిపడ్డారు.ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఉన్న సమయంలో వీరిద్దరూ ఆయన చాంబర్‌కు వెళ్లారు. దీనిపై ఫిర్యాదు చేశారు. అధికారులతో మాట్లాడతానని సీఎస్ వారికి చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆర్డీవో ఒక భూమి విషయంలో మంత్రి గంటాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పార్టీవర్గాలే చెబుతున్నాయి. మరో రెండు నెలలైతే ఆ భూమి గంటా పరమవుతుందని, అంతవరకు ఆయన్నే కొనసాగించాలని గంటా కోరుకుంటున్నట్లు సమాచారం.