Transfers employee
-
వ్యవసాయ, సహకార బదిలీల్లో ‘చేతి’వాటం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, సహకార శాఖల్లో చేపట్టిన బదిలీల్లో ఓ కీలక ప్రజాప్రతినిధికి చెందిన ఓఎస్డీ చేతివాటం చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తానే వ్యవసాయ కమిషనరేట్‌లో మూడురోజులు కూర్చొని డబ్బులు తీసుకొని తనకు ఇష్టమైన వారికి ఇష్టమైన చోట పోస్టింగ్ ఇచ్చారని వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయశాఖలో జరిగిన బదిలీలపై అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఇప్పటికే డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, సహకారశాఖలో జరిగిన బదిలీలపై ఉద్యోగ సంఘాలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. 40 శాతం ఉద్యోగులనే బదిలీ చేయాల్సి ఉన్నా, ఉన్నతాధికారులు దానికి మించి ఉత్తర్వులు ఇచ్చారని, సీనియారిటీని పట్టించుకోలేదని, ఆప్షన్లు ఇచి్చన వారికి కోరుకున్న చోట కాకుండా దూరంగా బదిలీ చేశారని ఆ వినతిపత్రంలో ప్రస్తావించారు. బ్లాక్ చేసి... ఆపై డబ్బులు వసూలు చేసి వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికా రులు (ఏఈవో), మండల వ్యవసాయాధికా రులు (ఏవో), వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీఏ), డిప్యూటీ డైరెక్టర్లు (డీడీ), వ్యవ సాయ జాయింట్ డైరెక్టర్లు (జేడీఏ)ల బదిలీలు చేపట్టారు. వ్యవసాయ, సహకారశాఖల్లో రుణమాఫీ కారణంగా ఈ నెల 20వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టారు. దాదాపు 900 మంది వరకు బదిలీలు జరిగాయని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. డిమాండ్‌ను బట్టి బదిలీల కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆ ఓఎస్డీ వసూలు చేసినట్టు ఉద్యోగులే చెబుతున్నారు.83 ఏడీఏ పోస్టులకుగాను 29 బ్లాక్ చేశా రు. మరో 11 ఇతర పోస్టులు బ్లాక్ చేశారని తెలిసింది. బ్లాక్ చేసినవే కాకుండా ఇతర పోస్టులను కూడా కౌన్సెలింగ్‌లో తమ వారికి దక్కేలా ఆ ఓఎస్డీ చక్రం తిప్పారు. సహకారశాఖలో 366 మంది ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి. గడు వు ముగిసిన తర్వాత ఈ నెల 21న ఐదుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ రిజిస్ట్రార్లు, 17 మంది జాయింట్ రిజి్రస్టార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేయలేదని, డబ్బులు చేతులు మారాయని విమర్శిస్తున్నా రు. సహకారశాఖలో దాదాపు 20 పోస్టులు బ్లాక్ చేసి, వాటిని అమ్ముకున్నారని ఉద్యోగులు అంటున్నారు. కొందరికైతే నాలుగేళ్లు నిండకుండానే బదిలీ చేస్తే... కొందరికైతే రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే బదిలీ చేశారు. అసలు వ్యవసాయ, సహకారశాఖల్లో బదిలీకి అర్హులైన జాబితాలో పేర్లు లేనివారిని కూడా చెప్పాపెట్టకుండా బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌లో బదిలీల నిలిపివేత Ü మార్క్‌ఫెడ్‌లో గత నెలలోనే బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ బది లీలు నిలిపివేశారు. హైదరాబాద్‌లో కీలకమైనచోట పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఉన్నతస్థాయిలో ఫైరవీలు చేయించుకొని తమకు స్థానచలనం జరగకుండా బదిలీలు నిలుపుదల చేశారన్న విమర్శలున్నాయి. మరోవైపు ఆయిల్‌ఫెడ్‌లోనూ ఏళ్లుగా బదిలీల ప్రక్రియ జరగడం లేదు. అనేకమంది ఏళ్ల తరబడి ఒకేచోట ఉన్నా, వారిని కదిలించడం లేదన్న చర్చ జరుగుతోంది. -
తహసీల్దార్ల బదిలీ!?
తహసీల్దార్లు జ్యోతి, రామకృష్ణ ఇద్దరు యాదాద్రి జిల్లా నుంచి బదిలీపై నల్లగొండ జిల్లాకు వస్తున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి పి.వీరేశం, ఆంజనేయులు, చంద్రశేఖర్, మహబూబ్ అలీ, శ్రీదేవి, ఎం.రాజేశ్వరి, అరుణ జ్యోతి, కార్తీక్, దామోదర్ రావు, విజయశ్రీ, జి.కృష్ణలు జిల్లాకు బదిలీపై రాగా, రంగారెడ్డి జిల్లా నుంచి ఆర్.బాలరాజు వస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి 23 మంది బయటి జిల్లాలకు వెళ్తుండగా, 14 మంది పక్క జిల్లాలనుంచి వస్తున్నారు. సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీచేశారు. అయితే అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. పది రోజులనుంచి అధికారులు బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఓటరు తుది జాబితా ప్రకటన ఉన్నందున ఆపారు. శనివారం జాబితా ప్రకటించగానే బదిలీల ప్రక్రియను మొదలుపెట్టారు. సొంత జిల్లా, సర్వీస్ బుక్ ఆధారంగా బదిలీలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. మొదట పాత జిల్లాల ప్రాతిపదికన కొనసాగిస్తారని అధికారులు పేర్కొన్నారు. కానీ ఎన్నికల సంఘం కొత్త జిల్లాను కలుపుతూ అవకాశం ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోనే బదిలీ చేశారు. నల్లగొండ జిల్లానుంచి మొత్తం 23 మంది బదిలీ అయ్యారు. వీరిని సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాద్‌కు బదిలీ చేయగా, సూర్యాపేట, రంగారెడ్డి నుంచి 14 మంది తిరిగి నల్లగొండకు వస్తున్నారు. అయితే వీరి బదిలీ ఉత్తర్వులు అధికారికంగా రావాల్సి ఉంది. సర్వీస్ బుక్ ఆధారంగా తహసీల్దార్ల సర్వీస్ బుక్ ఆధారంగా బదిలీలను చేశారు. అదే విధంగా మూడు సంవత్సరాలు ఒకే చోట పనిచేసే వారికి కూడా బదిలీ చేశారు. జిల్లా వారికి ఎన్నికల నిబంధనల ప్రకారం ఇతర జిల్లాకు బదిలీ చేశారు. -
సొమ్ము నాకు సీటు నీకు..!
వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదంటారు. సరిగ్గా ఓ మంత్రిగారు ఇలాగే ఆలోచిస్తున్నట్టున్నారు. వడ్డించేవాడు ‘మనవాడే’ కావాలని.. అప్పుడే అంతా తనకు అనుకూలంగా జరుగుతుందని భావిస్తున్నట్టున్నారు. అందుకే ‘రూల్స్ రామానుజా’ల్లా.. కొరకరాని కొయ్యలుగా మారిన అధికారులను ఎలాగోలా సాగనంపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. అనుకోకుండా దొరికిన ‘ఎన్నికల బదిలీల’ అస్త్రాన్ని వారిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. వారి స్థానాల్లో అనుకున్నవారిని తెచ్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. పనిలో పనిగా ‘లక్ష్మీ కటాక్షం’ కూడా సిద్ధించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని పలువురు చెప్పుకొంటున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపింది. మూడేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్నవారు, స్థానికులైన అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలన్నది నిబంధన. కానీ, వీటినితుంగలో తొక్కి తమకు అనుకూలంగా పని చేయనివారిని సాగనంపేందుకు ఒక మంత్రి పావులు కదుపుతున్నారు. ఇందులో లక్షల్లో సొమ్ములు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీ వేటు పడనున్న ఇద్దరిలో ఒకరు పెద్దాపురం ఆర్డీఓ బి.శంకరవరప్రసాద్ కాగా మరొకరు కాకినాడ ఆర్డీఓ జవహర్లాల్ నెహ్రూ. శంకరవరప్రసాద్ చిత్తూరు జిల్లా నుంచి 2012 అక్టోబర్ 12న బదిలీపై రంపచోడవరం వచ్చారు. అక్కడ కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేశాక పెద్దాపురానికి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇక్కడకు వచ్చి ఏడాదిన్నర కూడా కాలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయనను బదిలీ చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కానీ గత పంచాయతీ ఎన్నికల్లో ఒక మంత్రి చెప్పిన అభ్యర్థులను స్క్రూటినీలో అనర్హులుగా ప్రకటించకుండా నిజాయితీగా వ్యవహరించడమే ఆయన చేసిన నేరం. దీనిపై కక్ష కట్టిన ఆ మంత్రి ఆయనకు స్థానచలనం కల్పించేందుకు సిద్ధమయ్యారు. సదరు మంత్రిగారు ఆ సీటు అమ్మకానికి పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. కర్నూలులో ఆర్డీఓగా పని చేస్తున్న ఒక అధికారి ఈ సీటు కోసం ఆ మంత్రిగారికి రూ.25 లక్షలు సమర్పించుకున్నారని విశ్వసనీయ సమాచారం. గ్రూపు-1 2009 బ్యాచ్‌కు చెందిన ఆ అధికారి సొంత జిల్లా శ్రీకాకుళం. నర్సీపట్నం ఆర్డీఓగా పనిచేసిన ఆయన ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నా మంత్రి మాత్రం శివశంకరవరప్రసాద్ను బదిలీ చేసేవరకూ విడిచిపెట్టేది లేదంటున్నారని చెబుతున్నారు. గతంలో జిల్లా పరిషత్ సీఈఓగా పని చేసిన కొండయ్యశాస్త్రి బదిలీ విషయంలో కూడా సంబంధిత మంత్రి ఇలాగే వ్యవహరించిన తీరును అధికారులు గుర్తుకు తెస్తున్నారు. జగ్గంపేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారంలో ముక్కుసూటిగా కోర్టు తీర్పును అమలు చేసిన పాపానికి ఆ అధికారిని పట్టుబట్టి మరీ సాగనంపారు. ఆ తరువాత సీఈఓగా కె.జయరాజ్ వచ్చారు. ఆ సందర్భంగా రూ.30 లక్షలు చేతులు మారాయనే వార్తలు వచ్చాయి. ఆయన కొద్దికాలానికే ఏసీబీ దాడిలో సస్పెండవడం గమనార్హం. పౌరసరఫరాల శాఖలో మరో అధికారికి కాకినాడ ఆర్డీఓ పోస్టింగ్ ఇప్పిస్తానని సదరు మంత్రిగారు రూ.15 లక్షలు దిగమింగినా పని మాత్రం కాలేదు. ఆనక ఆ అధికారి నెత్తీనోరూ మొత్తుకున్నా చిల్లిగవ్వ కూడా ఆయనకు దక్కలేదని సమాచారం. అలాగే ఏరికోరి తెచ్చుకున్న కాకినాడ ఆర్డీఓ జవహర్లాల్ నెహ్రూను కూడా సాగనంపేందుకు మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నట్టు తెలియవచ్చింది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద ఈ ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్డీఓ జవహర్‌లాల్‌నెహ్రూ కోనసీమలోని ఒక ప్రజాప్రతినిధికి సమీప బంధువు. ఈ బంధుత్వం కారణంగా బదిలీ మంత్రాంగానికి ఆయన అడ్డుపడుతున్నారని సమాచారం. జవహర్లాల్ నెహ్రూకు స్థానచలనం కల్పించి ఆ సీటును కావాల్సిన అధికారికి కట్టబెట్టేందుకు రూ.25 లక్షలకు డీల్ కుదిరిందనట్టు తెలుస్తోంది. జవహర్లాల్ నెహ్రూ 2012 సెప్టెంబర్ 27న జిల్లాకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఒక అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అమలాపురం రిటైర్డ ఆర్డీఓకు ఈయన స్వయానా అల్లుడు. మొత్తమ్మీద మంత్రిగారి మంత్రాంగం వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ బదిలీలకు ఇచ్చిన గడువు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా మంత్రిగారి యత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.