డిమాండ్‌ను బట్టి రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు
ఓ కీలక ప్రజాప్రతినిధి ఓఎస్డీ నిర్వాకం..
వ్యవసాయశాఖలో 40, సహకారశాఖలో 20 బదిలీల్లో అక్రమాలు?
ఉద్యోగుల ఫిర్యాదులు.. వ్యవసాయ కమిషనరేట్‌లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, సహకార శాఖల్లో చేపట్టిన బదిలీల్లో ఓ కీలక ప్రజాప్రతినిధికి చెందిన ఓఎస్డీ చేతివాటం చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తానే వ్యవసాయ కమిషనరేట్‌లో మూడురోజులు కూర్చొని డబ్బులు తీసుకొని తనకు ఇష్టమైన వారికి ఇష్టమైన చోట పోస్టింగ్ ఇచ్చారని వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయశాఖలో జరిగిన బదిలీలపై అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఇప్పటికే డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, సహకారశాఖలో జరిగిన బదిలీలపై ఉద్యోగ సంఘాలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. 40 శాతం ఉద్యోగులనే బదిలీ చేయాల్సి ఉన్నా, ఉన్నతాధికారులు దానికి మించి ఉత్తర్వులు ఇచ్చారని, సీనియారిటీని పట్టించుకోలేదని, ఆప్షన్లు ఇచి్చన వారికి కోరుకున్న చోట కాకుండా దూరంగా బదిలీ చేశారని ఆ వినతిపత్రంలో ప్రస్తావించారు.
బ్లాక్ చేసి... ఆపై డబ్బులు వసూలు చేసి
వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికా రులు (ఏఈవో), మండల వ్యవసాయాధికా రులు (ఏవో), వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీఏ), డిప్యూటీ డైరెక్టర్లు (డీడీ), వ్యవ సాయ జాయింట్ డైరెక్టర్లు (జేడీఏ)ల బదిలీలు చేపట్టారు. వ్యవసాయ, సహకారశాఖల్లో రుణమాఫీ కారణంగా ఈ నెల 20వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టారు. దాదాపు 900 మంది వరకు బదిలీలు జరిగాయని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. డిమాండ్‌ను బట్టి బదిలీల కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆ ఓఎస్డీ వసూలు చేసినట్టు ఉద్యోగులే చెబుతున్నారు.
83 ఏడీఏ పోస్టులకుగాను 29 బ్లాక్ చేశా రు. మరో 11 ఇతర పోస్టులు బ్లాక్ చేశారని తెలిసింది. బ్లాక్ చేసినవే కాకుండా ఇతర పోస్టులను కూడా కౌన్సెలింగ్‌లో తమ వారికి దక్కేలా ఆ ఓఎస్డీ చక్రం తిప్పారు. సహకారశాఖలో 366 మంది ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి. గడు వు ముగిసిన తర్వాత ఈ నెల 21న ఐదుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ రిజిస్ట్రార్లు, 17 మంది జాయింట్ రిజి్రస్టార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేయలేదని, డబ్బులు చేతులు మారాయని విమర్శిస్తున్నా రు. సహకారశాఖలో దాదాపు 20 పోస్టులు బ్లాక్ చేసి, వాటిని అమ్ముకున్నారని ఉద్యోగులు అంటున్నారు. కొందరికైతే నాలుగేళ్లు నిండకుండానే బదిలీ చేస్తే... కొందరికైతే రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే బదిలీ చేశారు. అసలు వ్యవసాయ, సహకారశాఖల్లో బదిలీకి అర్హులైన జాబితాలో పేర్లు లేనివారిని కూడా చెప్పాపెట్టకుండా బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మార్క్‌ఫెడ్‌లో బదిలీల నిలిపివేత
Ü మార్క్‌ఫెడ్‌లో గత నెలలోనే బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ బది లీలు నిలిపివేశారు. హైదరాబాద్‌లో కీలకమైనచోట పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఉన్నతస్థాయిలో ఫైరవీలు చేయించుకొని తమకు స్థానచలనం జరగకుండా బదిలీలు నిలుపుదల చేశారన్న విమర్శలున్నాయి. మరోవైపు ఆయిల్‌ఫెడ్‌లోనూ ఏళ్లుగా బదిలీల ప్రక్రియ జరగడం లేదు. అనేకమంది ఏళ్ల తరబడి ఒకేచోట ఉన్నా, వారిని కదిలించడం లేదన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment