తహసీల్దార్లు జ్యోతి, రామకృష్ణ ఇద్దరు యాదాద్రి జిల్లా నుంచి బదిలీపై నల్లగొండ జిల్లాకు వస్తున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి పి.వీరేశం, ఆంజనేయులు, చంద్రశేఖర్, మహబూబ్ అలీ, శ్రీదేవి, ఎం.రాజేశ్వరి, అరుణ జ్యోతి, కార్తీక్, దామోదర్ రావు, విజయశ్రీ, జి.కృష్ణలు జిల్లాకు బదిలీపై రాగా, రంగారెడ్డి జిల్లా నుంచి ఆర్.బాలరాజు వస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి 23 మంది బయటి జిల్లాలకు వెళ్తుండగా, 14 మంది పక్క జిల్లాలనుంచి వస్తున్నారు.
సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీచేశారు. అయితే అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. పది రోజులనుంచి అధికారులు బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఓటరు తుది జాబితా ప్రకటన ఉన్నందున ఆపారు. శనివారం జాబితా ప్రకటించగానే బదిలీల ప్రక్రియను మొదలుపెట్టారు. సొంత జిల్లా, సర్వీస్ బుక్ ఆధారంగా బదిలీలను చేపడుతున్నట్లు తెలుస్తోంది.
మొదట పాత జిల్లాల ప్రాతిపదికన కొనసాగిస్తారని అధికారులు పేర్కొన్నారు. కానీ ఎన్నికల సంఘం కొత్త జిల్లాను కలుపుతూ అవకాశం ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోనే బదిలీ చేశారు. నల్లగొండ జిల్లానుంచి మొత్తం 23 మంది బదిలీ అయ్యారు. వీరిని సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాద్‌కు బదిలీ చేయగా, సూర్యాపేట, రంగారెడ్డి నుంచి 14 మంది తిరిగి నల్లగొండకు వస్తున్నారు. అయితే వీరి బదిలీ ఉత్తర్వులు అధికారికంగా రావాల్సి ఉంది.
సర్వీస్ బుక్ ఆధారంగా
తహసీల్దార్ల సర్వీస్ బుక్ ఆధారంగా బదిలీలను చేశారు. అదే విధంగా మూడు సంవత్సరాలు ఒకే చోట పనిచేసే వారికి కూడా బదిలీ చేశారు. జిల్లా వారికి ఎన్నికల నిబంధనల ప్రకారం ఇతర జిల్లాకు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment