Transfoarmers
-
కాపర్‌వైరు చోరీ నిందితుడికి రిమాండ్
మామడ: ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ చోరీ కేసులో మండల కేంద్రానికి చెందిన రాపని ఎల్లయ్యను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నవీన్‌కుమార్, ఎస్సై అశోక్ గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాపని ఎల్లయ్య 2017 నుంచి వరంగల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఆరేళ్ల నుంచి ప్రతి ఆరు నెలలకోసారి పెరోల్‌పై 30 రోజులు ఇంటికి వచ్చి జైలుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్‌వైరు చోరీ చేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న పాత నేరస్తులు మహారాష్ట్రకు చెందిన ఫఖర్ గోరే, నిజామాబాద్‌కు చెందిన బాబురావు దండేల్వర్తో కలిసి కడెం, సోన్, లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్, మామడ మండలంలోని లింగాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్‌వైర్ చోరీ చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక సాయంతో వలపన్ని నిందితుడు ఎల్లయ్యను పట్టుకున్నారు. చోరీ కోసం వినియోగించిన రింగు పానలు, సెల్‌ఫోన్, కాపర్‌వైరును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో ఫఖర్ గోరేను గత వారం అరెస్ట్ చేయగా, మరో నిందితుడు బాబూరావ్ దండేల్వర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
అదనపు ట్రాన్స్ఫార్మర్లకు బడ్జెట్ విడుదల చేయాలి
నల్లగొండ టూ టౌన్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓవర్‌లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అదనపు ట్రాన్స్ఫార్మర్లకు బడ్జెట్ విడుదల చేయాలని ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు పంపిన ప్రతిపాదనలకు వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని కోరుతూ పీఆర్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లోని ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవర్‌లోడ్‌తో రైతుల ట్రాన్స్ఫార్మర్ల కాలిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. మండలాల అధికారులు అదనపు ట్రాన్స్ఫార్మర్ల కోసం ప్రతిపాదనలు పంపినా బడ్డెట్ విడుదల చేయకుండా నాన్చడం సరైంది కాదన్నారు. అనంతరం డీఈ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పీఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గోపిరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, కుకుడాల దశరథరెడ్డి, సుధాకర్, ఎల్లెంల వీరయ్యయాదవ్, కె.సత్యనారాయణచారి, పరుశరామ్, నవీన్, సైదిరెడ్డి పాల్గొన్నారు.