వివరాలు వెల్లడిస్తున్న సీఐ నవీన్‌కుమార్, ఎస్సై అశోక్
మామడ: ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైర్ చోరీ కేసులో మండల కేంద్రానికి చెందిన రాపని ఎల్లయ్యను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నవీన్‌కుమార్, ఎస్సై అశోక్ గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాపని ఎల్లయ్య 2017 నుంచి వరంగల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఆరేళ్ల నుంచి ప్రతి ఆరు నెలలకోసారి పెరోల్‌పై 30 రోజులు ఇంటికి వచ్చి జైలుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్‌వైరు చోరీ చేస్తున్నాడు.
తనకు పరిచయం ఉన్న పాత నేరస్తులు మహారాష్ట్రకు చెందిన ఫఖర్ గోరే, నిజామాబాద్‌కు చెందిన బాబురావు దండేల్వర్‌తో కలిసి కడెం, సోన్, లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్, మామడ మండలంలోని లింగాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌వైర్ చోరీ చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక సాయంతో వలపన్ని నిందితుడు ఎల్లయ్యను పట్టుకున్నారు. చోరీ కోసం వినియోగించిన రింగు పానలు, సెల్‌ఫోన్, కాపర్‌వైరును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో ఫఖర్ గోరేను గత వారం అరెస్ట్ చేయగా, మరో నిందితుడు బాబూరావ్ దండేల్వర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment